ఫొటో క్యాప్షన్‌ కాంటెస్ట్‌కు విశేష స్పందన

ABN , First Publish Date - 2021-10-30T05:23:53+05:30 IST

పోలీసు అమరవీ రుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆన్‌లైన్‌ లో ఫొటో క్యాప్షన్‌ కాంటెస్ట్‌కు విశేష స్పందన ల భించిందని ఎస్పీ మలికగర్గ్‌ పేర్కొన్నారు.

ఫొటో క్యాప్షన్‌ కాంటెస్ట్‌కు విశేష స్పందన
విజేతకు బహుమతిని అందజేస్తున్న ఎస్పీ మలికగర్గ్‌

బహుమతులను అందజేసిన ఎస్పీ


ఒంగోలు(క్రైం), అక్టోబరు 29: పోలీసు అమరవీ రుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆన్‌లైన్‌ లో ఫొటో క్యాప్షన్‌ కాంటెస్ట్‌కు విశేష స్పందన ల భించిందని ఎస్పీ మలికగర్గ్‌ పేర్కొన్నారు. ఒంగోలు లోని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కా ర్యక్రమంలో విజేతలకు ఆమె బహుమతులు అం దజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌ సోషల్‌ మీడియా ద్వారా పలు సామాజిక మాధ్యమాల్లో నిర్వహించిన ఫొటో కాంటెస్ట్‌కు అనేక మంది తమ కామెంట్స్‌ రాయండంతో మం చి స్పందన వచ్చిందన్నారు. అనంతరం విజేతలైన చీరాలకు చెందిన యండమూరి శౌరి, దొనకొండకు చెందిన గోరా వెంకటరమణ, వెంకటేశ్వరరావు, ఒంగోలుకు చెందిన కృష్ణ దాసు, మార్కాపురానికి చెందిన అజయ్‌ కరుణ, చంద శివకుమార్‌, వ ల్లూరుకు చెందిన ప్రైజిలకు ఎస్పీ బహుమతులు అందజేసి వారిని అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ బి.రవిచంద్ర, కమాండ్‌కంట్రోల్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.శ్రీనివాసరావు, ఆర్‌ఐ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-30T05:23:53+05:30 IST