ఎస్పీ బదిలీ
ABN , First Publish Date - 2021-07-08T07:23:01+05:30 IST
ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కృష్ణా జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి.

కృష్ణా జిల్లా ఎస్పీగా సిద్ధార్థ కౌశల్‌కు పోస్టింగ్
ఒంగోలు(క్రైం), జూలై 7: ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కృష్ణా జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే జిల్లాకు ఇంకా ఎస్పీగా ఎవరినీ నియమించలేదు. సాధారణ ఎన్నికలకు రెండు రోజులు ముందుగా జిల్లాకు ఎస్పీగా వచ్చిన సిద్ధార్థకౌశల్ 27నెలలపాటు పనిచేశారు. ఈకాలంలో సాధారణ ఎన్నికలతోపాటు, స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించారు. జిల్లాలో పోలీస్‌శాఖ ప్రతిష్టపెంచేందుకు అనేక చర్యలు చేపట్టారు. కాగా ఎస్పీని బుధవారం ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కలిసి శాలువా కప్పి సత్కరించారు.
-----------------------------------------------