ఆప్యాయతలకు మారుపేరు సొంతూరు

ABN , First Publish Date - 2021-10-29T05:41:48+05:30 IST

ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా సొంతూరు వస్తే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిదని మిజోరం రాష్ట్ర గవర్నర్‌ కంభంపాటి హరిబాబు తన మిత్రులతో అన్నారు. గురువారం ఆయన మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావుతో కలిసి తన స్వగ్రామం తిమ్మసముద్రం వచ్చారు. ముందుగా తన బావ ముద్దన జయచంద్రశేఖర్‌ ఇంటికి వచ్చారు. అక్కడ ఎస్పీ మలిక గర్గ్‌ పర్యవేక్షణలో పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ గవర్నర్‌కు మొక్కను అందజేశారు.

ఆప్యాయతలకు మారుపేరు సొంతూరు
మిజోరం గవర్నర్‌ హరిబాబును సన్మానిస్తున్న కరణం వెంకటేష్‌,బలరాం తదితరులు

మిజోరం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు

తిమ్మసముద్రం(చీరాల), అక్టోబరు 28: ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా సొంతూరు వస్తే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిదని మిజోరం రాష్ట్ర గవర్నర్‌ కంభంపాటి హరిబాబు తన మిత్రులతో అన్నారు. గురువారం ఆయన మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావుతో కలిసి తన స్వగ్రామం తిమ్మసముద్రం వచ్చారు.   ముందుగా తన బావ ముద్దన జయచంద్రశేఖర్‌ ఇంటికి వచ్చారు. అక్కడ ఎస్పీ మలిక గర్గ్‌ పర్యవేక్షణలో పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ గవర్నర్‌కు మొక్కను అందజేశారు. ముందుగా ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, ఆయన తనయుడు కరణం వెంకటేష్‌లను ప్రత్యేకంగా పలకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సోదరి అన్నపూర్ణమ్మ మృతిచెందినపుడు తాను బైపాస్‌ సర్జరీ చేయించుకున్నందున రాలేకపోయానన్నారు. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చానన్నారు.. అనంతరం వారంతా కలసి అన్నపూర్ణమ్మ కుటుంబసభ్యులను పరామర్శించారు. గవర్నర్‌ హరిబాబు వచ్చే సమయానికి ఎమ్మెల్యే కరణం బలరాం, వెంకటేష్‌లు అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించారు. గ్రామసర్పంచ్‌ సాల్మన్‌ను వారు కలెక్టర్‌, ఎస్పీలకు పరిచయం చేశారు. ఏర్పాట్లకు సంబంధించి వారు బలరాం, వెంకటేష్‌లతో చర్చించారు. వెంకటేష్‌ చీరాల మున్సిపల్‌ పాలకవర్గం ఇతర నాయకులను గవర్నర్‌ హరిబాబుకు, కామినేని శ్రీనివాసరావులకు పరిచయం చేశారు. పలువురు హరిబాబు సమకాలీకులు, స్నేహితులు ఆయనను కలిసి మాట్లాడారు. చీరాల బీజేపీ నాయకులు ప్రముఖ న్యాయవాది బండారుపల్లి హేమంత్‌కుమార్‌, మువ్వల వెంకటరమణారావు తదితరులు గవర్నర్‌ను ప్రత్యేకంగా కలిశారు. అక్కడ నుంచి హరిబాబు బృందం జరుబులు భూషయ్య ఇంటికి వెళ్లి ఆయనను పలకరించారు. ఆ తర్వాత తన సొంతింటికి వెళ్లి భోజన అనంతరం రోడ్డుమార్గాన పొన్నూరు వెళ్లిపోయారు. కార్యక్రమంలో ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకరబాబు, దారా సాంబయ్య, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టరు వరికూటి అమృతపాణి, చీరాల మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్‌ కరణం రమేష్‌బాబు, సొసైటీ అధ్యక్షుడు ముద్దన నాగేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు రావిపాటి అశోక్‌, ఉసురుపాటి రాజు, ఎంపీపీ కృష్ణారెడ్డి, జరుబుల స్వామి, బాలిన రామ్మూర్తి, చాబిల్‌, సురేంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:41:48+05:30 IST