వరద ఉధృతికి కొట్టుకుపోయిన తూము గేటు

ABN , First Publish Date - 2021-12-02T05:34:19+05:30 IST

వరద నీటితో పందువగండి చెరువు తూము గేటు కొట్టుకుపోయింది. దీంతో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మిగతా గేట్లు కూడా బలహీనంగా ఉండటంతో నీరు లీకై ప్రమాద పరిస్థితికి చేరుకుంది. దీంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. అదేవిధంగా గన్నవరం వద్ద రెండో రోజుకూడా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

వరద ఉధృతికి కొట్టుకుపోయిన తూము గేటు
గన్నవరంలో ట్రాక్టర్‌ ద్వారా విద్యార్ధులను తరలిస్తున్న గ్రామస్తులు

  వెలిగండ్ల, డిసెంబరు 1: వరద నీటితో పందువగండి చెరువు తూము గేటు కొట్టుకుపోయింది. దీంతో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మిగతా గేట్లు కూడా బలహీనంగా ఉండటంతో నీరు లీకై ప్రమాద పరిస్థితికి చేరుకుంది. దీంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. అదేవిధంగా గన్నవరం వద్ద రెండో రోజుకూడా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు ఉధృతంగా ప్రవహించడంతో పోలీసుల సహకారంతో స్కూల్‌కు వచ్చిన విద్యార్థులను ట్రాక్టర్‌ సహాయంతో ఒడ్డుకు చేర్చారు. వాగు ఉధృతి దృష్ట్యా గ్రామస్థులు ప్రయాణాలు మానుకోవాలని పోలీసులు సూచించారు. 

Updated Date - 2021-12-02T05:34:19+05:30 IST