శింగరకొండ ఈవోకు పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవాలయం బాధ్యతలు

ABN , First Publish Date - 2021-12-08T05:45:20+05:30 IST

శింగరకొండలోని శ్రీప్రసన్నాంజనేయస్వామి దేవ స్థానం ఈవో శ్రీనివాసరెడ్డికి గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవ స్థానం ఇన్‌చార్జి ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మంగళవారం ఆయన అక్కడ బాధ్యతలు స్వీకరించారు.

శింగరకొండ ఈవోకు  పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవాలయం బాధ్యతలు
అద్దంకి, డిసెంబరు 7 : శింగరకొండలోని శ్రీప్రసన్నాంజనేయస్వామి దేవ స్థానం ఈవో శ్రీనివాసరెడ్డికి గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవ స్థానం ఇన్‌చార్జి ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మంగళవారం ఆయన అక్కడ బాధ్యతలు స్వీకరించారు. శింగరకొండ శ్రీప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో చైర్మన్‌, ఈవోల మధ్య అంతర్యుద్ధం కొ నసాగుతున్న విషయం విదితమే. ఒకరిపై మరొకరు ఉన్నతాధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదులు చేసుకున్నారు. వీటిపై విజయవాడ దుర్గామల్లేశ్వరస్వా మి దేవస్థానం జాయింట్‌  కమిషనర్‌ బ్రమరాంబను విచారణాధికారిగా నియ మించారు. ఈనెల 1వతేదీ విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈవో శ్రీనివాసరెడ్డికి  పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవాలయం ఇన్‌ చార్జి బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది. 


Updated Date - 2021-12-08T05:45:20+05:30 IST