బీసీ కాలనీలో కాలువలు నిర్మించాలి

ABN , First Publish Date - 2021-12-10T05:20:38+05:30 IST

బేస్తవారపేట గ్రామ పం చాయతీలోని బీసీ కాలనీలో వెంటనే కాలువలను నిర్మిం చాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.

బీసీ కాలనీలో కాలువలు నిర్మించాలి

బేస్తవారపేట, డిసెంబరు 9 : బేస్తవారపేట గ్రామ పం చాయతీలోని బీసీ కాలనీలో వెంటనే కాలువలను  నిర్మిం చాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. కాలనీలో కాలువల సౌ కర్యం లేక మురుగు నీరు రోడ్లపైనే నిలిచి ఉంటోంది. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  చిన్నపాటి వాన కురి సినా రోడ్లపై నీరు నిలిచిపోతోంది. దీంతో దోమలకు ఆవాసా లుగా మారుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.  గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి కాలువలను ని ర్మించాలని బీసీ కాలనీ వాసులు  కోరుతున్నారు.  


Updated Date - 2021-12-10T05:20:38+05:30 IST