మురుగు కాలువ పనులు ప్రారంభం

ABN , First Publish Date - 2021-12-16T04:44:21+05:30 IST

పట్టణంలోని 16వ వార్డులో మురికి నీటి కాలువ పనులను బుధవారం మున్సిపల్‌ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య ప్రారంభించారు.

మురుగు కాలువ పనులు ప్రారంభం
కాలువ పనులను ప్రారంభిస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌


గిద్దలూరు టౌన్‌, డిసెంబరు 15 : పట్టణంలోని 16వ వార్డులో మురికి నీటి కాలువ పనులను బుధవారం మున్సిపల్‌ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య ప్రారంభించారు. ఈసందర్భంగా చైర్మన్‌ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ పట్టణంలో మురికినీటి సమస్య, మంచినీటి సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నామని, ప్రధానమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రామకృష్ణ, వైసీపీ నాయకులు ముద్దర్ల శ్రీనివాసులు, శ్రీరాములు, నంద్యాల బాలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-16T04:44:21+05:30 IST