నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడిగా శేషాద్రి

ABN , First Publish Date - 2021-12-31T05:06:44+05:30 IST

ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షునిగా దొడ్డా శేషాద్రిని నియమించినట్లు పార్టీ మండల అధ్యక్షుడు ఏర్వ మల్లికార్జునరెడ్డి గురువారం ప్రకటనలో తెలిపారు.

నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడిగా శేషాద్రి

పెద్ద దోర్నాల, డిసెంబరు 30 : ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షునిగా దొడ్డా శేషాద్రిని నియమించినట్లు పార్టీ మండల అధ్యక్షుడు ఏర్వ మల్లికార్జునరెడ్డి గురువారం ప్రకటనలో తెలిపారు. తెలుగు యువత అధ్యక్ష పదవికి ఎంపిక చేయడంపై శేషాద్రి ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, వైపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు, జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మన్నె రవీంద్రకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మండల పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై  ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలో పేతానికి కృషి చేస్తానని దొడ్డా పేర్కొన్నారు.


Updated Date - 2021-12-31T05:06:44+05:30 IST