జాతీయ ఖోఖో పోటీలకు ఆంధ్రా జట్ల ఎంపిక

ABN , First Publish Date - 2021-08-27T06:18:34+05:30 IST

జాతీయ స్థాయి ఖో ఖో పోటీలలో పాల్గొనే బాల బాలికల జట్ల ఎంపిక గురువారం పంగులూరులో జరిగింది. ఎంపికయి న క్రీడాకారుల వివరాలను ఎ.కె.ఎ్‌ఫ.ఐ. ఉపాధ్య క్షుడు ప్రకటించారు.

జాతీయ ఖోఖో పోటీలకు ఆంధ్రా జట్ల ఎంపిక
ఎంపికైన క్రీడాకారులతో అధికారులు

పంగులూరు, ఆగస్టు 26 : జాతీయ స్థాయి ఖో ఖో పోటీలలో పాల్గొనే బాల బాలికల జట్ల ఎంపిక గురువారం పంగులూరులో జరిగింది. ఎంపికయి న క్రీడాకారుల వివరాలను ఎ.కె.ఎ్‌ఫ.ఐ. ఉపాధ్య క్షుడు  ప్రకటించారు. ఎంపికయిన జట్లు సెప్టెంబ రు 22 నుంచి 26 వరకు ఒడిస్సా రాష్ట్రం భువనేశ్వర్‌లో జరిగే 40వ అఖిల భారత స్థాయి జూనియర్‌ ఖోఖో పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ ఎంపికకు 13 జిల్లాలనుంచి 100 మంది బాలు రు, 70 మంది బాలికలు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ నెల 27 నుంచి సెప్టెంబరు 29 వరకు పంగులూరు ఎంఎ్‌సఆర్‌. అండ్‌ బి.ఎన్‌.ఎం. కళాశాలలో బాలుర జట్టుకు, బాలికలకు కంచర్లవారిపాలెం జ డ్‌పీ హైస్కూలులో శిక్షణ  ఇస్తామని తెలిపారు. 


 బాలుర జట్టు 


జాతీయ స్థాయి ఖోఖో పోటీలలో పాల్గొనే బాలుర జట్టుకు ఎం.ఫణికుమార్‌,  కె.వంశీ, ఎం.వెంకటేష్‌, జి.నానీ, ఎ.కోరేష్‌, పి.హర్శిత్‌కుమార్‌రెడ్డి (ప్రకాశం), ఆర్‌.సూరినాయుడు, వి. భానుప్రసాద్‌ (విజయనగరం), కె.ప్రవీణ్‌(శ్రీకాకు ళం), కె.మహేష్‌ (గుంటూరు), ఎం.రాము (తూ.గో.), బి.కృష్ణ, కె.మణికంఠ(విశాఖ),షేక్‌ మ హబూబ్‌ (కర్నూల్‌), ఎ.సురేష్‌ (అనంతపురం), డి.మహీధర్‌ (నెల్లూరు), పి.అభిషేక్‌ (కృష్ణ), బి.అశోక్‌(ప.గో.), జి.వెంకటేష్‌ (చిత్తూరు).


బాలికల జట్టు 


ఎం.రత్నం (తూ.గో.), షేక్‌ ఫరియా (నెల్లూరు), ఈ.హైమావతి (కడప), జి. ఆర్‌.అఖిల , డి.శివనాగలక్ష్మి, బి.శిరీషా (ప్రకాశం), ఎ.హేమలత (విశాఖ), ఆర్‌.రేవతి (విజయనగ రం), కె.చైతన్య, డి.అఖిల, బి.మౌనిక (కృష్ణ), బి.హర్తీషా (చిత్తూరు), ఎస్‌.మెబీనా (అనంతపురం), ఐ.శ్రావణి (విజయనగరం), బి.శాంతి (ప.గో.) తదితరులు ఎంపికయ్యారు. 


Updated Date - 2021-08-27T06:18:34+05:30 IST