వీధినబడి

ABN , First Publish Date - 2021-10-28T06:55:37+05:30 IST

విలీనంలో భాగంగా సుమారు 75 ఏళ్ల చరిత్ర కలిగిన ఎయిడెడ్‌ పాఠశాల మూతబడనుంది.

వీధినబడి
పాఠశాల వద్ద నిరసనకు దిగిన విద్యార్థులు,తల్లిదండ్రులు

75 ఏళ్ల చరిత్ర కలిగిన పాఠశాల మనుగడకు ముప్పు

కమీషన్‌ బకాయిలు ఇవ్వాలి, గోతాల జీవో ఉపసంహరించాలని డిమాండ్‌

చాపకింద నీరులా ఆందోళన

ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద నిరసన

చీరాల టౌన్‌, అక్టోబరు 27: విలీనంలో భాగంగా సుమారు 75 ఏళ్ల చరిత్ర కలిగిన ఎయిడెడ్‌ పాఠశాల మూతబడనుంది. అక్కడ చదువుతున్న విద్యార్థులకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బలవంతంగా టీసీలు ఇస్తుండటంతో తల్లిదండ్రులు తిరగబడ్డారు. దీంతో అడ్డగోలు వ్యవహారం రచ్చకెక్కింది. వివరాల్లోకి వెళితే... మండల పరిధిలోని దేవాంగపురి పంచాయతీలో ఉన్న హస్తినాపురం జేహెచ్‌డీడీఎ్‌సఏపీ(వీఽధిబడి) ఎయిడెడ్‌ పాఠశాల 1947 నుంచి నడుస్తోంది. ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ చదువుకుని ఉన్నతస్థానాల్లో ఉన్నారు. పేదలందరికీ బాసటగా నిలిచిన ఈ పాఠశాలను ఇటీవల రాష్ట్రప్రభుత్వం కఠినంగా అమలుచేస్తున్న ఎయిడెడ్‌ పాఠశాలల విలీనం కింద చేర్చారు. అందులో పనిచేసే ఉపాధ్యాయుల సంసిద్ధతతో విలీన ప్రక్రియను విద్యాశాఖ ప్రారంభించింది. ప్రస్తుతం 1-5 తరగతుల్లో 81మంది చదువుతున్నారు. వీరి పర్సంటేజీని జీరోగా చూపించాలని ఉపాధ్యాయులకు ఉన్నతాధికారులు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులను ఏదో రకంగా మభ్యపెట్టి టీసీలు ఇవ్వడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బుధవారం పాఠశాల వద్దకు పిల్లల తల్లిదండ్రులు కొందరు చేరుకుని నిరసన తెలిపారు. దీంతో ఉపాధ్యాయులు బలవంతంగా టీసీలు ఇవ్వడాన్ని నిలిపివేశారు. ఈ వ్యవహారం రచ్చకెక్కడంతో ఉపాధ్యాయులు పాఠశాల నుంచి వెళ్లిపోయారు.


Updated Date - 2021-10-28T06:55:37+05:30 IST