రైతులకు పథకాలు అందేలా చూడాలి
ABN , First Publish Date - 2021-12-29T04:39:12+05:30 IST
వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు పథకాలు రైతులకు అందేలా చూడాలని జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు ఎస్.శ్రీనివాసరావు అన్నారు.
జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు శ్రీనివాసరావు
గిద్దలూరు టౌన్, డిసెంబరు 28 : వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు పథకాలు రైతులకు అందేలా చూడాలని జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు ఎస్.శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం గిద్దలూరు సబ్ డివిజన్ పరిధిలోని వ్యవసాయాధికారులు, రైతు భరోసా సిబ్బందితో వివిధ పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పంట నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని, రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాలలో వరి కొనుగోలు కేంద్రాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రైతు భరోసా సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు బాలాజీనాయక్, వివిధ మండలాల వ్యవసాయాధికారులు, విస్తరణ అధికారులు, భరోసా కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.