అంగన్వాడీల పనితీరుపై సర్పంచ్‌ ఆగ్రహం

ABN , First Publish Date - 2021-11-26T05:21:09+05:30 IST

మండలంలోని సుంకేసుల అంగన్‌వాడీ కేంద్రంలో సిబ్బంది పనితీరుపై సర్పంచ్‌ జి.రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంగన్వాడీల పనితీరుపై సర్పంచ్‌ ఆగ్రహం


పెద్దారవీడు(మార్కాపురం), నవంబరు 25: మండలంలోని సుంకేసుల అంగన్‌వాడీ కేంద్రంలో సిబ్బంది పనితీరుపై సర్పంచ్‌ జి.రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని గురువారం సందర్శించిన సర్పంచ్‌ రికార్డులను పరిశీలించారు. కేంద్రాలలో సిబ్బంది యూనిఫాం ధరించక పోవడం, సిబ్బంది గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌష్టికాహారం పం పిణీ చేసే సమయంలో సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి పర్యవేక్షిం చాలని రమేష్‌ సూచించారు. కార్యక్రమంలో ఉన్నతపాఠశాల పీఎంసీ చైర్మన్‌ దుగ్గి చిన్న నారాయణరెడ్డి, వీఆర్వో షేక్‌ చిన్నఖాసింపీరా, సచివాలయ సిబ్బం ది  పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-26T05:21:09+05:30 IST