సంప్రదాయ సాగు కనుమరుగు

ABN , First Publish Date - 2021-03-22T05:39:53+05:30 IST

మారుతున్న కాలంతో పాటు పోటీతత్త్వం, సాంకేతికతతో పురాతన వ్వవసా యం కనుమరుగయ్యే పరిష్థితులు ఏర్పడుతున్నాయి.

సంప్రదాయ సాగు కనుమరుగు
ఎడ్లతో సేద్యం చేస్తున్న రైతు (ఫైల్‌)


భారంగా మారిన పశు పోషణ

యాంత్రీకరణ పద్ధతులపై దృష్టి

పెద్ద దోర్నాల, మార్చి 21 : మారుతున్న కాలంతో పాటు పోటీతత్త్వం,  సాంకేతికతతో పురాతన వ్వవసా యం కనుమరుగయ్యే పరిష్థితులు ఏర్పడుతున్నాయి. సంప్రదాయ సాగులో ప్రధాన పాత్రను పోషించిన ఎ ద్దులు ఇపుడు పొలాల్లో దున్నుతున్నట్లు కనిపించడం లేదు. గతంలో ప్రతి గ్రామంలో వ్యవసాయం చేసే రైతులందరికీ జత ఎద్దులు, పాడి గేదెలు ఉండేవి. వా టి కోసం ప్రత్యేకంగా కొస్టాలను కూడా ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం గ్రామాల్లో నాల్గోవంతు కూడా ఎ ద్దులు ఉండే పరిస్థితి లేదు. ప్రధానంగా ఎద్దులు జత కొనాలంటే లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అంతేగాక పశు గ్రాసం, దాణా కోసం ఏడాదికి రూ.50వేలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోందని పోషకులు అంటున్నారు. వర్షాభావం, తాగు, సాగు నీటి కొరత, గ్రాసం కొరత కారణంగా పశువులను పెంచడం ఆర్థిక భారంగా మారుతోందని పలు వురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేది లేక కొందరు ఎడ్లను అమ్మేస్తుండగా గ్రామాల్లో కొత్తగా ఎవరూ కొనడం లేదు. ప్రస్తుతం సా గులో యాంత్రీకరణ పద్ధతులను రైతులు ఉప యోగిస్తున్నారు. వ్యవసాయ ఖర్చులు పెరుగు తున్నప్పటికీ తప్పని పరిస్థితిలో ట్రాక్టర్లు, ఇతర యంత్రాలతో పనులు పూర్తి చేస్తున్నారు. ఈ పద్ధతువల్ల పంటల సాగులో అంతర సేద్యం కష్టమవుతోంది.  యాంత్రీకరణ పద్ధతులు వలన రైతులకు సులభంగా శీఘ్రంగా పొలం పనులు అవుతు న్నప్పటికీ సేంద్రియ సాగు మాత్రం తగ్గిపోతోంది.  ప్రస్తుతం పంటల సాగులో కూలీల కొరత  రైతులకు పెద్ద ఇబ్బందికరం గా మారింది. ఇలాంటి పరిస్థితిలో సాంకేతిక పరిజ్ఞానం రైతులకు ఎం తగానో ఉపయోగకంగా మారిందనే చెప్పాలి. యాంత్రీకరణ వలన కూ లీల కొరత రైతులకు కలిసి వస్తోంది. దుక్కి, విత్తనం విత్తే దశ  నుంచి పంట కోత, నూర్పిళ్లు, ఇంటికి సరఫ రా వరకు అంతా ట్రాక్టర్లతోనే సాగి పోతోంది. మరో వైపు సంప్రదాయ సాగు కనుమరుగవుతోం దన్న ఆందోళన పలువురు రైతుల్లో నెలకొనివుంది. విచ్చలవిడిగా రసాయనికఎరువులు వినియోగం వలన పంటలు కలుషితం కావడం, భూమి నిస్సా రం కావడం, ఎడ్లు కళేభరాలకు తరలించడం తీరని నష్టంగా వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని సేంద్రియ పద్ధతులతో సాగు చేపట్టి నట్లయితే భూములను, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.




Updated Date - 2021-03-22T05:39:53+05:30 IST