సమస్యలు పరిష్కరించండి

ABN , First Publish Date - 2021-07-13T05:24:53+05:30 IST

సమస్యలు పరిష్కరించాలని కోరు తూ మండలంలోని గ్రామ సేవకులు తహసీల్దార్‌ కార్యాల యం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.

సమస్యలు పరిష్కరించండి
అధికారికి వినతిపత్రం అందజేస్తున్న గ్రామ సేవకులు

గ్రామ సేవకుల నిరసన

గిద్దలూరు, జూలై 12 : సమస్యలు పరిష్కరించాలని కోరు తూ మండలంలోని గ్రామ సేవకులు తహసీల్దార్‌ కార్యాల యం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రెవెన్యూ అధి కారులకు వినతిపత్రం అందచేశారు. గ్రామసేవకుల సంఘం జిల్లా నాయకులు ఒ.ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామసేవకులకు కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలని, డీఏ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 14వ తేదీ వరకు మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు ఉంటాయని, సమస్యలు పరిష్కరించకపోతే 23న కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఆవులయ్య, నరసింహులు, శ్రీనివాసులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-13T05:24:53+05:30 IST