సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

ABN , First Publish Date - 2021-08-10T05:43:34+05:30 IST

గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
అర్జీలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిఎమ్మెల్యే నాగార్జునరెడ్డి

తర్లుపాడు, ఆగస్టు 9: గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడారు.  మండలంలో ఎక్కువుగా రెవెన్యూ సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేం దుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. స్పందన కార్యక్రమాల్లో రెవెన్యూ సమస్యలపై 35 అర్జీలు ఎమ్మెల్యే స్వీకరించారు. తర్లుపాడులోని బీఈడీ కళాశాల వద్ద ఉన్న గతంలో మంజూరైన అసైన్డ్‌ భూములకు రహదారిని చూపించాలని, తు మ్మలచెరువులో ఈద్గా స్థలాన్ని కొందరు ఆక్రమించారని, పోతలపాడు వీఆర్‌వో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని  ఎమ్మెల్యేకు అర్జీలు అందజేశారు. నెలలోపు స మస్యలను పరిష్కరించాలని తహసీల్దార్‌ శైలేంద్రకుమార్‌కు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్‌.నరసింహులు, సర్పంచ్‌ పల్లెపోగు వరాలు, ఆర్‌ఐ ఎం.వి.రమణ, వ్యవసాయాధికారి చంద్రశేఖర్‌, అధికారులు, వీఆర్‌వోలు పాల్గొన్నారు.

పొదిలి రూరల్‌లో..

పొదిలి (రూరల్‌) : మండలంలో 90 లక్షల గ్రాంట్‌ వచ్చిందని వాటిని పట్ట ణంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించాలని ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి సూచించారు. సోమవారం పొదిలిలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలపై స మావేశం నిర్వహించారు. అవసమైన అభివృద్ధి పనులకు నిధులు కేటాయి స్తార న్నారు. పట్టణాభివృద్ధికి రూ.75లక్షలు, ఎస్సీ, ఎస్టీ కింద రూ.15లక్షలు కలిపి మొత్తం రూ.90లక్షలు వాటర్‌ పైప్‌లైన్లకు, విద్యుత్‌ దీపాలు, డ్రైనేజీలకు ఉపయో గించాల న్నారు. సమావేశంలో నగర పంచాయతీ  కమిషనర్‌ భాను ప్రసాద్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-08-10T05:43:34+05:30 IST