ఆర్యవైశ్యుల సమారాధన
ABN , First Publish Date - 2021-10-25T05:37:53+05:30 IST
దసరా శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా పట్టణంలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం ఆర్యవైశ్య సమారాఽధన (సహపంక్తి భోజనం) కార్యక్రమం నిర్వహించారు.

గిద్దలూరు, అక్టోబరు 24 : దసరా శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా పట్టణంలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం ఆర్యవైశ్య సమారాఽధన (సహపంక్తి భోజనం) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకుసుమ హరనాథ మందిరం ఆవరణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని ఆర్యవైశ్యులందరూ సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాలలో దేవస్థాన కమిటీ అధ్యక్షుడు వాడకట్టు రంగసత్యనారాయణ, కార్యదర్శి తుమ్మలపెంట సత్యనారాయణ, గౌరవాధ్యక్షుడు శివపురం ఆంజనేయులు, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.