రైతులు పథకాలను వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2021-07-13T05:05:08+05:30 IST

: రైతుల అభ్యు న్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథ కాల ను సద్వినియోగం చేసుకోవాలని ఏవో లక్ష్మీ నారాయణ అన్నారు.

రైతులు పథకాలను వినియోగించుకోవాలి
రైతులకు విత్తనాలు అందజేస్తున్న ఏవో లక్ష్మీనారాయణ

మార్కాపురం, జూలై 12 : రైతుల అభ్యు న్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథ కాల ను సద్వినియోగం చేసుకోవాలని ఏవో లక్ష్మీ నారాయణ అన్నారు. మండలంలోని భూపతి పల్లి, మాల్యవంతునిపాడులో సోమవారం వైఎ స్సార్‌ రైతు భరోసా యాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు వ్యవసాయ, అను బంధ శాఖల అధికారులతో రాబోయే సీజన్‌లో వేసుకోవాల్సిన పంటలు, ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ఖరీఫ్‌ సీజన్లో మార్కెట్‌ ఆఽథారిత వరి వంగడాల సాగుపై అవగాహన కల్పించారు. మెట్ట, బోర్ల భూముల్లో ప్రత్నామ్నా య పంటల సాగుపై అవగాహన, విత్తన కొ నుగోళ్లలో రైతులు తీసుకోవల్సిన జాగ్రత్తలు, భూసార పరీక్షల ఆధారంగా రైతులకు ఎరు వుల వాడకంపై అవగాహన కల్పించారు.  కార్యక్రమంలో పశు వైద్యాధికారులు లీనా గ్రేస్‌, రసగ్న, హార్టికల్చర్‌ ఏవో భాస్కర్‌రెడ్డి, ఏఈవో సంపత్‌కుమార్‌, వీఏ ఏ శివ, ఎంపీఈవోలు రమణి, ప్రణీత, కోటేశ్వరి పాల్గొన్నారు. 

పొదిలి రూరల్‌లో..

పొదిలి (రూరల్‌) : రైతులు పంట విత్త నా లు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా రశీ దు పొందాలని వ్యవసాయాధికారి శ్రీనివాస రెడ్డి అన్నారు. రైతు భరోసా చైతన్య యాత్రల్లో భాగంగా సోమవారం తళమళ్ల, ఆముదాలపల్లి గ్రామాల్లో రైతులతో సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. కార్యక్రమంలో పశు వైద్యా ధికారి, సర్పంచ్‌లు శ్రీనివాసులు, వెంకట సుబ్బ మ్మ, సిబ్బంది పాల్గొన్నారు. 

త్రిపురాంతకంలో..

త్రిపురాంతకం : మండలంలోని దూపాడు, గొల్లపల్లిలో రైతు భరోసా చైతన్య యాత్రలను సోమవారం నిర్వహించారు.  ఏవో నీరజ, పశు సంవర్థక శాఖ ఏడీ సీహెచ్‌.రమేష్‌కుమార్‌ పథకాలను వివరించారు. కార్యక్రమంలో సూక్ష్మ సేద్య ఏరియా అధికారి సత్యప్రసాద్‌, వైద్యాధికారి నాగుర్‌మీరా, సర్పంచ్‌లు ఎనిబెర శైలజ, ఓబులరెడ్డి వెంకట తిరుమలయ్య, వ్యయవ సాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.



2

Updated Date - 2021-07-13T05:05:08+05:30 IST