రోడ్డంతా గుంతలు..!

ABN , First Publish Date - 2021-11-01T04:50:15+05:30 IST

సుఖ ప్రయాణానికి ఎంతో అనువుగా ఉండాల్సిన రోడ్లు భారీ గోతులతో ఛిద్రమయ్యాయి. ప్రయాణం అంటనే చిర్రెత్తుకొస్తున్న పరిస్థితులు తయారయ్యాయి. ఏ రోడ్డు చూసినా దారుణమే.

రోడ్డంతా గుంతలు..!
కంభంలోని స్టేట్‌బ్యాంక్‌ సమీపంలో గుంతలుపడిన రోడ్డు


సుఖ ప్రయాణానికి ఎంతో అనువుగా ఉండాల్సిన రోడ్లు భారీ గోతులతో ఛిద్రమయ్యాయి. ప్రయాణం అంటనే చిర్రెత్తుకొస్తున్న పరిస్థితులు తయారయ్యాయి. ఏ రోడ్డు చూసినా దారుణమే. అంతర్గత రోడ్లు అయినా, బాహ్య రోడ్లు అయినా గోతులు సర్వసాధారణమయ్యాయి. కంభం గ్రామ పంచాయతీలోని స్టేట్‌ బ్యాంక్‌ నుంచి పాత ప్రభుత్వ వైద్యశాల వరకు ఆర్‌ అండ్‌ బీ రోడ్డు మొత్తం భారీగా గుంతలు పడ్డాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు గుంతలుపడిన ప్రాంతంలో స్టేట్‌బ్యాంక్‌, పెట్రోల్‌ బంక్‌, ప్రైవేటు పాఠశాల ఉండడంతో నిత్యం వందలాది మంది ఖాతాదారులు, వాహనదారులు, విద్యార్థులు, పాదచారులు అసౌకర్యానికి గురవుతున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డు మరింత కోతకు గురవడంతో భారీగా గుంతలుపడ్డాయి. వాటిల్లో వర్షం నీరు నిలవడంతో వాహనదారులు వేగంగా వచ్చి అదుపుతప్పి గుంతల్లోపడి కిందపడుతున్నారన్నారు. ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. -కంభం

Updated Date - 2021-11-01T04:50:15+05:30 IST