రహదారులు అధ్వానం

ABN , First Publish Date - 2021-05-02T05:55:35+05:30 IST

పొదిలి మండలంలోని గ్రామీణ ప్రాంత రహ దారులు అధ్వానంగా, అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

రహదారులు అధ్వానం
మధ్యలోనే ఆగిన రామాపురం రోడ్డు పనులు


పొదిలి మండలంలో 

దశాబ్దాలుగా ఆగిన తారు రోడ్ల నిర్మాణం

ఇబ్బందిపడుతున్న ప్రజలు

పట్టించుకోని పాలకులు, ఉన్నతాధికారులు


పొదిలి రూరల్‌, మే 1 : పొదిలి మండలంలోని గ్రామీణ ప్రాంత రహ దారులు అధ్వానంగా, అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దశాబ్దాలుగా పూర్తి స్థాయిలో నిర్మాణాలకు నోచుకోక పోవడంతో గ్రామీణాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పల్లెబాట పేరుతో గ్రామీణ రహదారుల అభివృద్ధికి నిధులు విడుదల చేశారు. అయితే అప్పట్లో దర్శి నియోజక వర్గంలో ఉన్న పొదిలి పరిధిలోని గ్రామాల్లో ఈ నిధులతో పొదిలి రోడ్డు నుంచి బుచ్చనపాలెం, నిమ్మవరం, ఆముదాలపల్లి నుంచి అన్నవరం వర కు తారురోడ్డు నిర్మాణం ఏర్పాటు చేశారు. అదే సమయంలో దర్శి శాసన సభ్యులుగా ఉన్న బూచేపల్లి సుబ్బారెడ్డి రాజీవ్‌ పల్లెబాటలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని కుంచేపల్లి తీసుకువచ్చారు. ఆ సమయంలో ఉన్నగురవాయపాలెం నుంచి రాములవీడు రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే అది అర్ధాంతరంగా నిలిచిపోయింది. అదేవిధంగా దాస ళ్లపల్లి నుంచి కాశీపురం వరకు ఏర్పాటు చేసిన తారురోడ్డు 75 శాతం పూర్తి అయ్యి ప్రభుత్వం మారడంతో అది అసంపూర్తిగా నిలిచిపోయింది. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేప ట్టి నిర్మించ తలపెట్టిన వెలిగండ్ల నుంచి ఈగల పాడు వరకు చేపట్టిన రోడ్డు ఆదిలోనే హంస పాదులాగా కొంత మేరా పని చేసిన తరువాత నిలిచి పోయింది. గత ప్రభుత్వ హయాంలో నిధుల విడుదలకు యత్నించినా ఫలితం లేకుం డా పోయింది. అనంతరం కొత్తగా ఏర్పాటైన వైసీపీ ప్రభుత్వం కొత్తగా రోడ్ల నిర్మాణానికి నిధు లు విడుదల చేసింది. నిర్మాణం కోసం డస్ట్‌వేసి గ్రావెల్‌ తోలిన కాంట్రాక్టర్‌ కొన్ని నెలలుగా దాన్ని అట్టే వదిలేశారు. దీంతో గులకరాళ్లు లేచి ఉం డడంతో వాహనదారులు,  పాదచారులు నరకం చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో  పొదిలి అక్కచెరువు రోడ్డు నుంచి తుమ్మగుంట వరకు నిర్మి స్తున్న తారురోడ్డు ప్రభుత్వం మారడంతో బి ల్లులు రాకపోవడంతో ఆ రోడ్డు అసంపూర్తిగా నిలి చి పోయింది. ఒక్కోక్క ప్రభుత్వ హయాంలో ఒక్కో సమస్యతో ప్రారంభించిన రోడ్లు అనేక సమ స్యలతో అసంపూర్తిగా నిలిచిపోయాయి. 

ప్రభుత్వాలు మారినా..

మూడు ప్రభుత్వాలు మారినా మండలంలోని ఆయా రోడ్లను పూర్తి చేసి గ్రామీణ ప్రాంత ప్ర జలకు ఉపయోగంలోకి తెచ్చే నాయకులు, అధి కారులు పొదిలి ప్రాంతంలో ఉన్నారా లేరా అ నే సందేహం కలుగుతుందని ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

రోడ్డు నిర్మాణం చేయక ముందు పొదిలి ఆర్టీసీ అధికారులు మంగాపురం, ఈగలపాడు వెలిగండ్ల గ్రామాలకు బస్సులు నడిపారు. ప్రస్తుతం ఈ రహదారులు అసంపూర్తిగా ఉం డటంతో బస్సులు తిరగడం లేదు. గ్రామాల రహదారులు  అధ్వానంగా ఉండటంతో ఆటోలు కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కొన్ని కిలోమీటర్ల వరకు నడిచి అనంతరం ఏదైనా వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి  అర్ధంతరంగా నిలిపివేసిన రోడ్లను పరి శీలించి వాటి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామాల ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. Updated Date - 2021-05-02T05:55:35+05:30 IST