జనసేన పార్టీ జిల్లా అధ్యక్షునిగా రియాజ్
ABN , First Publish Date - 2021-07-08T07:21:43+05:30 IST
జనసేన పార్టీ జిల్లా అధ్యక్షునిగా షేక్ రియాజ్‌ను నియమిస్తూ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తర్వులు జారీచేశారు.

ఒంగోలు(కలెక్టరేట్), జూలై 7 : జనసేన పార్టీ జిల్లా అధ్యక్షునిగా షేక్ రియాజ్‌ను నియమిస్తూ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తర్వులు జారీచేశారు. బుధవారం మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చేతులమీదుగా రియాజ్ నియామక పత్రాన్ని అందుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి రియాజ్ క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత పార్టీ అధినేత పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని రియాజ్ జిల్లాలో నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకు జిల్లా ఇన్‌చార్జీగా ఉన్న రియాజ్‌ను జిల్లా అధ్యక్షునిగా నియమించడంతో ఆ పార్టీశ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అలాగే పార్టీ పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎన్‌జీపాడు మండలం ముప్పాళ్లకు చెందిన పెదపూడి విజయకుమార్‌ను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు.