స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-11-09T05:49:11+05:30 IST

స్పందనలో వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ జె.వెంకట మురళి అదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. స్పందనకు హాజరైన పలువురు తమ సమస్యలను జేసీ ఎదుట ఏకరువు పెట్టారు. గిరిజన గురుకుల పాఠశాలల్లో నాలుగేళ్ల నుంచి పని చేస్తున్న తమను కొవిడ్‌ సమయంలో తొలగించారని ఆదివాసి ఆరోగ్య కార్యకర్తలు జేసీ దృష్టికి తెచ్చారు.

స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
స్పందనలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న జేసీ వెంకటమురళి

జేసీ వెంకటమురళి

ఒంగోలు (కలెక్టరేట్‌), నవంబరు 8 : స్పందనలో వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ జె.వెంకట మురళి అదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.  స్పందనకు హాజరైన పలువురు తమ సమస్యలను జేసీ ఎదుట ఏకరువు పెట్టారు. గిరిజన గురుకుల పాఠశాలల్లో నాలుగేళ్ల నుంచి పని చేస్తున్న తమను కొవిడ్‌ సమయంలో తొలగించారని ఆదివాసి ఆరోగ్య కార్యకర్తలు జేసీ దృష్టికి తెచ్చారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వేటపాలెం పంచాయతీ పరిధిలో ఓరుగంటిరెడ్డి వీధికి చెందిన వీరలంకమ్మ, మస్తాన్‌రెడ్డి కోటేశ్వరమ్మ తమపై కులపెద్దల పేరుతో కొందరు దౌర్జన్యం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇలా పలువురు సమస్యలను విన్నవించారు. అంతకుముందు డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమానికి పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఫోన్‌ చేసి సమస్యలను  చెప్పారు. 


Updated Date - 2021-11-09T05:49:11+05:30 IST