డ్రోన్‌ ద్వారా భూములు రీసర్వే

ABN , First Publish Date - 2021-08-27T05:50:51+05:30 IST

మండలంలోని నూకవరంలో రెవెన్యూ అదికారులు డ్రోన్‌ ద్వారా రీసర్వే కార్యక్రమాన్ని గురువారం లాంఛనంగాప్రారంభించారు.

డ్రోన్‌ ద్వారా భూములు రీసర్వే
సర్వే కోసం సిద్ధం చేసిన డ్రోను

నూకవరం (వలేటివారిపాలెం) ఆగస్టు 26 : మండలంలోని నూకవరంలో రెవెన్యూ అదికారులు డ్రోన్‌ ద్వారా రీసర్వే కార్యక్రమాన్ని గురువారం లాంఛనంగాప్రారంభించారు. మండలంలోని 21 రెవెన్యూ గ్రామాలకు గానూ నూకవరం రెవెన్యూ గ్రామాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి జగనన్న శాశ్విత భూహక్కు- భూరక్ష కార్యక్రమం ద్వారా రీసర్వే ప్రారంభించారు. గ్రామంలోని భూములను నాలుగు వైపులా ఉన్న సరిహద్దులను ఏర్పాటు చేసి కంప్యూటరైజేషన్‌ చేశారు. డ్రోన్‌ను తహసీల్దార్‌ సయ్యద్‌ ముజిపర్‌ రెహ్మన్‌ సమక్షంలో ఎగురవేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రెహ్మన్‌, ఎంపీడీవో రఫీద్‌ అహ్మద్‌, నూకవరం సర్పంచ్‌ దాచర్ల శాంతమ్మ, మండల డిప్యూటీ సర్వేయర్‌ శ్రీలక్షీ ్మ, ఆర్‌ఐ ప్రసాద్‌, వైసీపీ నాయకులు దాచర్ల వెంకట్రావు, నల్లమోతు చంద్రమౌలి, దాచర్ల చెంచురామయ్య, నరసింగరావు, మల్లెబోయిన మాల్యాద్రి, నీరుత్తి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-27T05:50:51+05:30 IST