రేపు మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన

ABN , First Publish Date - 2021-05-30T06:38:35+05:30 IST

మార్కాపురం మండలం రాయవరం వద్ద ప్రభుత్వం మం జూరు చేసిన వైద్య కళాశాలకు సీఎం జగన్‌ 31 సోమవారం వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి తెలిపారు.

రేపు మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన

ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి

మార్కాపురం, మే 29: మార్కాపురం మండలం రాయవరం వద్ద ప్రభుత్వం మం జూరు చేసిన వైద్య కళాశాలకు సీఎం జగన్‌ 31 సోమవారం వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి తెలిపారు. రాయవరం వద్ద శంకుస్థాపనకు సంబంధించిన పనులను శనివారం ఆయన పరిశీలించారు.  తొలుత శంకుస్థాపన ఆదివారం చేయాలని నిర్ణయించినప్పటికీ అనివార్య కా రణాల వలన సోమవారానికి వాయిదా వేసినట్లు చెప్పారు. 31 ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య శంకుస్థాపన ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి విశ్వరూప్‌, జిల్లా మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌, జిల్లాలోని ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొంటారని తెలిపారు. ఇప్పటికే శంకుస్థాపనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. కళాశాల నిర్మాణానికి రూ.475 కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు. టెండర్లు త్వరలో పూర్తవుతాయన్నారు.  ఎమ్మెల్యే వెంట మున్సిపల్‌ చైర్మన్‌ చిల్లంచెర్ల బాలమురళీకృష్ణ, వైస్‌చైర్మన్‌ షేక్‌ ఇస్మాయిల్‌, ఆర్డీవో ఎం.శేషిరెడ్డి, తహసీల్దార్‌ విద్యాసాగరుడు, ఎంపీడీవో హనుమంతరావు, ట్రాన్స్‌కో ఈఈ ప్రసన్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-30T06:38:35+05:30 IST