సీపీఎస్‌ రద్దు హామీని సీఎంకు గుర్తు చేయండి

ABN , First Publish Date - 2021-10-29T05:00:21+05:30 IST

సీపీఎస్‌ రద్దు హామీని సీ ఎం జగన్‌మోహన్‌రెడ్డికి గు ర్తు చేసి సమస్యను పరిష్కరించేలా చూడాలని సీపీఎస్‌ ఉద్యోగులు శాప్‌ నెట్‌ చైర్మన్‌, అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య కు వినతిపత్రం అందజేశారు.

సీపీఎస్‌ రద్దు హామీని సీఎంకు గుర్తు చేయండి
కృష్ణచైతన్యకు వినతిపత్రం అందజేస్తున్న సీపీఎస్‌ ఉద్యోగులు

బాచిన కృష్ణచైతన్యకు ఉద్యోగుల వినతి


అద్దంకిటౌన్‌, అక్టోబరు 28: సీపీఎస్‌ రద్దు హామీని సీ ఎం జగన్‌మోహన్‌రెడ్డికి గు ర్తు చేసి సమస్యను పరిష్కరించేలా చూడాలని సీపీఎస్‌ ఉద్యోగులు శాప్‌ నెట్‌ చైర్మన్‌, అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య కు వినతిపత్రం అందజేశారు. గురువారం అద్దంకి నగర పంచాయతీలోని 1వ వార్డులో పర్యటించిన కృష్ణ చైతన్యను ఉద్యోగులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా  ఏపీసీపీఎ్‌సఈఏ రాష్ట్ర కౌన్సిలర్‌ దామా నాగేశ్వరరావు మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో సీపీఎస్‌ రద్దు చేస్తామని  హామీ ఇచ్చిన జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని గురించి పట్టించుకోవడం లేదని, కనీసం ఉద్యోగులను చర్చకు కూ డా పిలవడం లేదన్నారు. ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు స్వామి, వెంకయ్య, ర వీంద్ర, శ్రీనివాసరావు, సునాధ్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-10-29T05:00:21+05:30 IST