రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించాలి

ABN , First Publish Date - 2021-12-16T04:42:04+05:30 IST

మార్కాపురం పట్టణం, పరిసర ప్రాంతాల్లో అన్‌ అప్రూవ్డ్‌ లే-అవుట్లలో రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించాలని రియల్టర్లు, భూముల కొనుగాలుదారులు డిమాండ్‌ చేశారు.

రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించాలి
ధర్నా చేస్తున్న రియల్టర్లు, డాక్యుమెంట్‌ రైటర్లు

రియల్టర్లు, కొనుగోలుదారుల ధర్నా


మార్కాపురం, డిసెంబరు 15 : మార్కాపురం పట్టణం, పరిసర ప్రాంతాల్లో అన్‌ అప్రూవ్డ్‌ లే-అవుట్లలో రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించాలని రియల్టర్లు, భూముల కొనుగాలుదారులు డిమాండ్‌ చేశారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ వక్కలగడ్డ మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో స్థిరాస్తి వ్యాపారంలో తీవ్ర సంక్షోభం నెలకొందన్నారు. వీరి ధర్నాకు సంఘీభావం తెలిసిన జనసేన మార్కాపురం ఇన్‌చార్జి ఇమ్మడి కాశీనాథ్‌ మాట్లాడుతూ వైసీపీ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వలన ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలపై జగన్‌ నేతృత్వంలో నాయకులు నీళ్లుచల్లుతున్నారని విమర్శించారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం మాట్లాడుతూ ప్రభుత్వాధినేతలు తీసుకుంటున్న పిచ్చి తుగ్లక్‌ నిర్ణయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో పెద్దారవీడు టీడీపీ నాయకులు గొట్టం శ్రీనివాసరెడ్డి, రియల్టర్లు చక్రపాణి, శ్రీనివాసులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-16T04:42:04+05:30 IST