వైట్ క్వార్జ్ తవ్వకాలకు పర్యావరణ అనుమతులకు ప్రజాభిప్రాయ సేకరణ
ABN , First Publish Date - 2021-12-16T04:46:11+05:30 IST
మండలంలోని బోదనంపాడు గ్రామం కొండపోరంబోకులో వైట్ క్వార్జ్ తవ్వకాలకు పర్యావరణ అనుమతులు మంజూరుకు జాయింట్ కలెక్టరు మురళి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ప్రజలెవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. బోదనంపాడు గ్రామం పక్కనే 227 సర్వే నంబరులో 943 ఎకరాల విస్తీర్ణంలో కొండ ఉంది. కొండ చుట్టూ కొంత పోరంబోకు స్థలం కూడా ఉంది. ఆ భూమిలో 26.93 ఎకరాల విస్తీర్ణంలో వైట్ క్వార్జ్ తవ్వకాలకు అనుమతుల కోసం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కడపకు చెందిన హెచ్‌ఎం మైన్స్, మినరల్స్ కంపెనీ వారు దరఖాస్తు చేసుకున్నారు.

పర్యావరణ అనుమతులపై ప్రజాభిప్రాయ సేకరణ
కురిచేడు, డిసెంబరు 15: మండలంలోని బోదనంపాడు గ్రామం కొండపోరంబోకులో వైట్ క్వార్జ్ తవ్వకాలకు పర్యావరణ అనుమతులు మంజూరుకు జాయింట్ కలెక్టరు మురళి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ప్రజలెవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. బోదనంపాడు గ్రామం పక్కనే 227 సర్వే నంబరులో 943 ఎకరాల విస్తీర్ణంలో కొండ ఉంది. కొండ చుట్టూ కొంత పోరంబోకు స్థలం కూడా ఉంది. ఆ భూమిలో 26.93 ఎకరాల విస్తీర్ణంలో వైట్ క్వార్జ్ తవ్వకాలకు అనుమతుల కోసం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కడపకు చెందిన హెచ్‌ఎం మైన్స్, మినరల్స్ కంపెనీ వారు దరఖాస్తు చేసుకున్నారు. కందుకూరు సబ్ కలెక్టరు తనిఖీలు చేసి ఎన్‌వోసీ మంజూరు కాగా బుధవారం పర్యావరణ అనుమతుల కోసం జాయింట్ కలెక్టరు ప్రజాభాప్రాయ సేకరణ చేశారు. కొండ వద్దనే ప్రజావేదిక ఏర్పాటు చేశారు. ప్రజలెవరూ తమ అభ్యంతరాలను వ్యక్తం చేయలేదు. ఈ కార్యక్రమంలో జేసీ మురళి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ నాగిరెడ్డి, తహసీల్దార్ రాధాకృష్ణ, బోదనంపాడు, నమశ్శివాయపురం గ్రామస్థులు పాల్గొన్నారు.