వెనకడుగు వేయని రెబల్స్‌

ABN , First Publish Date - 2021-02-05T06:15:03+05:30 IST

కొ త్తపట్నం మండలంలోని అ న్ని గ్రామాల్లో సర్పంచ్‌ పద వులకు పోటీ జరగనుం ది. నామినేషన్ల ఉప సంహరణకు చివరిరోజైన గురువారం కూడా రెబల్స్‌ అభ్యర్థులు తమ నా మినేషన్ల ఉప సంహరణకు ముందుకు రాలేదు.

వెనకడుగు వేయని రెబల్స్‌

ఒకరిపైనొకరు వైసీపీ నాయకుల పోటీ

నామినేషన్ల ఉపసంహరణకు రాని వైనం 

ఈతముక్కలలో ఏకంగా ఏడుగురు 


కొత్తపట్నం, ఫిబ్రవరి 4: కొ త్తపట్నం మండలంలోని అ న్ని గ్రామాల్లో  సర్పంచ్‌ పద వులకు పోటీ జరగనుం ది. నామినేషన్ల ఉప సంహరణకు చివరిరోజైన గురువారం కూడా రెబల్స్‌ అభ్యర్థులు తమ నా మినేషన్ల ఉప సంహరణకు ముందుకు రాలేదు. ఏ మాత్రం వెనక్కి తగ్గేదిలేదంటూ నాయకుల కు తేల్చిచెప్పేశారు. దీంతో మండలంలోని అన్ని గ్రామాల్లో పోటీ అనివార్యమయ్యింది. మండలం లో మొత్తం 15 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతుండగా ఎక్కువ గ్రామాల్లో వైసీపీ నా యకులే ఒకరిపై ఒకరు తలపడుతున్నారు. టీ డీపీ పోటీ లేని చోట కూడా వైసీపీ మద్దతు దారులు ఒకరిపై ఒకరు రంగంలోకి దిగారు. సర్పంచ్‌ పదవికి ఎక్కువగా ఈతముక్కల గ్రా మంలో పోటీ పడుతున్నారు. ఇందులో ఒకరు టీడీపీ మద్దుతుదారుడు కాగా, మిగిలిన ఆరుగు రిలో ఎక్కువ మంది వైసీపీ పేరుతోనే రంగంలో కి దిగారు. మడనూరులో ఇద్దరు పోటీ పడుతు న్నారు. ఒకరికి టీడీపీ బలపరుస్తూ రంగంలోకి దింపింది. ఇక సంకువానిగుంట లో ఇద్దరు వైసీ పీ వర్గీయులే తలపడుతున్నారు. రాజుపాలెంలో టీడీపీ, వైసీపీ ఇద్దరే పోటీలో ఉన్నారు. ఇక గ మళ్ళపాలెంలో కూడా అదే పరిస్థితి. కొత్తపట్నం లో తెలుగుదేశం, సీపీఐ ఒప్పందం కుదిరింది.  ఇక్కడ సీపీఐతో వైసీపీ మద్దతు అభ్యర్ధి తలప డుతోంది. రంగాయపాలెంలో టీడీపీ, వైసీపీలకు చెందిన ఇద్దరు అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. పాదర్తిలో జనరల్‌ మహిళలకు కేటాయించిన సర్పంచ్‌ పదవికి ఇద్దరు ఎస్సీ మహిళలే పోటీ లో మిగిలారు. అయతే వారు వైసీపీ మద్దతు దారులుగానే చెప్పుకుంటున్నారు. ఇక్కడ టీడీపీ మద్దతుతో  నామినేషన్‌ వేసినా చివరిలో ఉప సంహరించుకున్నారు. గాదెపాలెంలో టీడీపీ మ ద్దతుదారుడుతో పాటు వైసీపీ తరపున ఇద్దరు బరిలో ఉన్నారు. ఆలూరులోలో కూడా వైసీపీ రె బల్‌ రంగంలో ఉన్నారు.  మోటుమాల, గుండమాల గ్రామాల్లో టీడీపీ మద్దుతుదారుడితో పాటు వైసీపీ రెబల్‌ కూడా బరిలో ఉన్నారు. మొత్తంగా ఎక్కువ చోట్ల వైసీపీకే రెబల్స్‌ బెడద ఎక్కువగా ఉంది. దీంతో ఫలితాలు ఏ విధంగా ఉంటాయోననే ఆందోళన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.

Updated Date - 2021-02-05T06:15:03+05:30 IST