జిల్లా సర్పంచ్‌ల సంఘం అధికార ప్రతినిధిగా రసూల్‌

ABN , First Publish Date - 2021-10-15T04:51:30+05:30 IST

జిల్లా సర్పంచ్‌ల సంఘం అధికార ప్రతినిధి కంభం మండలం చిన్నకంభం గ్రామపంచాయతీ సర్పంచ్‌ ఎస్‌ఎమ్డీ రసూల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గురువారం ప్రకటనలో తెలిపారు.

జిల్లా సర్పంచ్‌ల సంఘం అధికార ప్రతినిధిగా రసూల్‌

కంభం, అక్టోబరు 14 : జిల్లా సర్పంచ్‌ల సంఘం అధికార ప్రతినిధి కంభం మండలం చిన్నకంభం గ్రామపంచాయతీ సర్పంచ్‌ ఎస్‌ఎమ్డీ రసూల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలులో గురువారం జిల్లాసర్పంచ్‌ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వీరభద్రాచారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తనను సర్పంచ్‌ల సంఘ అధికార ప్రతినిధిగా ఎన్నుకున్నట్లు తెలిపారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 

సర్పంచ్‌ల సంఘ అధ్యక్షురాలిగా వెంకటరాజమ్మ 

గిద్దలూరు టౌన్‌, అక్టోబరు 14 : ఒంగోలులో జరిగిన ఎన్నికలో గిద్దలూరు మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షురాలిగా ఎస్‌.వెంకటరాజమ్మ ఎన్నికయ్యారు. 

జిల్లా ప్రధాన కార్యదర్శిగా పగడాల

రాచర్ల : చినగానిపల్లి సర్పంచ్‌ పగడాల రమేష్‌ జిల్లా సర్పంచ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం బాధ్యతలు చేపట్టిన పగడాల రమేష్‌ను సర్పంచ్‌ లు శిరిగిరి రమేష్‌, గోతం నారాయణ, పులి నారాయణ, మురళీ కృష్ణ, ఏలం గోవిందయ్య ఘనంగా సన్మానించారు. Updated Date - 2021-10-15T04:51:30+05:30 IST