వెంకటరమణ హాస్పటల్‌లో అరుదైన శస్త్రచికిత్స

ABN , First Publish Date - 2021-12-26T06:07:10+05:30 IST

ఒంగో లులోని వెంకటరమణ సూపర్‌స్పెషాలిటీ హాస్ప టల్‌లో అరుదైన శస్త్రచికిత్సను చేశారు.

వెంకటరమణ హాస్పటల్‌లో అరుదైన శస్త్రచికిత్స
మాట్లాడుతున్న డాక్టర్‌ చంద్రశేఖర్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 25 : ఒంగో లులోని వెంకటరమణ సూపర్‌స్పెషాలిటీ హాస్ప టల్‌లో అరుదైన శస్త్రచికిత్సను చేశారు. కందుకూ రు మండలం విక్కిరాలపేటకు చెందిన రమణ మ్మ మెడనొప్పితో బాధపడుతూ హైదరాబాద్‌తో పాటు పలు హాస్పటల్స్‌లో వైద్యపరీక్షలు చేయిం చుకున్నారు. అయితే మెడ వెనుకభాగం  నుంచి వెన్నుపూస నరం లోపల ఉండే కండరాల్లో గడ్డ వచ్చింది. ఈ వ్యాధి తల్లిదండ్రుల నుంచి వంశ పారంపర్యంగా లేక, స్టాన్‌ టేనియేషన్‌ ద్వారా వ స్తోంది. దీంతో రమణమ్మ ఒంగోలులోని వెంకట రమణ హాస్పటల్‌కు చెందిన డాక్టర్‌ కామేపల్లి చంద్రశేఖర్‌ను కలిశారు. ఆమె వైద్య పరీక్షలు ని ర్వహించారు. వైద్యులు చంద్రశేఖర్‌, మురళీకృష్ణ, మత్తు డాక్టర్లు శ్రీనివాస్‌, నాగరాజుల ఆధ్వర్యం లో సుమారు రెండు గంటలకు పైగా సర్జరీ చేసి విజయవంతంగా ఆ గడ్డను తొలగించారు. శని వారం స్థానిక హాస్పటల్‌లో ఏర్పాటు చేసిన వి లేఖరుల సమావేశంలో డాక్టర్‌ చంద్రశేఖర్‌ మా ట్లాడుతూ ఆ గడ్డను తొలగించకపోతే కాళ్లు, చే తులు చచ్చుబడటం, ఆయాసం రావడం, చివర కు వెంటిలేటర్‌పైనే గడపాల్సి వచ్చేదని తెలిపా రు. గడ్డను తొలగించడం వల్ల ప్రస్తుతం రమణ మ్మ ఆరోగ్యంగా ఉందని చంద్రశేఖర్‌ చెప్పారు.


Updated Date - 2021-12-26T06:07:10+05:30 IST