వైభవంగా గోదా రంగనాయకస్వామి కల్యాణం

ABN , First Publish Date - 2021-01-14T04:53:06+05:30 IST

భోగి సందర్భంగా గోదా రంగనాయక స్వామి కల్యాణాన్ని బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక ఎన్నెస్పీ కాలనీలోని వేంకటేశ్వరాలయం, కోదండరామాలయాలలో స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు.

వైభవంగా గోదా రంగనాయకస్వామి కల్యాణం
గోదాదేవి కళ్యాణంలో పాల్గొన్న భక్తులు

త్రిపురాంతకం, జనవరి 13 : భోగి సందర్భంగా గోదా రంగనాయక స్వామి కల్యాణాన్ని బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక ఎన్నెస్పీ కాలనీలోని వేంకటేశ్వరాలయం, కోదండరామాలయాలలో స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ , అన్న ప్రసాద కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించారు.

 పెద్దదోర్నాలలో..

పెద్ద దోర్నాల: స్థానిక లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా భోగి పండుగను పురస్కరించుకుని గోదాదేవి, శ్రీ కృష్ణుడి  కల్యాణ వేడుకలను బుధవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్ల కల్యాణ క్రతువును తిలకించి పులకించిపోయారు. 

కంభంలో 

కంభం  : స్థానిక వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం భోగిపండుగ సందర్భంగా వేంకటేశ్వరస్వామి, ఉభయదేవిల కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. కల్యాణాన్ని అనేక మంది భక్తులు పాల్గొని తిలకించారు.Updated Date - 2021-01-14T04:53:06+05:30 IST