ఆంధ్రజ్యోతి జర్నలిస్టుకి రైతునేస్తం అవార్డు

ABN , First Publish Date - 2021-10-31T07:12:03+05:30 IST

రైతుల సమస్యలను ప్రతిబింబిస్తూ రాష్ట్రంలో గుర్తింపుపొందిన రైతునేస్తం పత్రిక అందజేసే ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ ఐవీసుబ్బారావు రైతునేస్తం అవార్డు అగ్రి జర్నలిజం విభాగంలో ఒంగోలులో ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ రిపోర్టరుగా పనిచేస్తున్న సూర్యదేవర నవీన్‌బాబుకు లభించింది.

ఆంధ్రజ్యోతి జర్నలిస్టుకి రైతునేస్తం అవార్డు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న నవీన్‌ 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

రైతుల సమస్యలను ప్రతిబింబిస్తూ రాష్ట్రంలో గుర్తింపుపొందిన రైతునేస్తం పత్రిక అందజేసే ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ ఐవీసుబ్బారావు రైతునేస్తం అవార్డు అగ్రి జర్నలిజం విభాగంలో ఒంగోలులో ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ రిపోర్టరుగా పనిచేస్తున్న సూర్యదేవర నవీన్‌బాబుకు లభించింది. రైతు సమస్యలు, ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను విశ్లేషిస్తూ వార్తలు, కథనాలు రాసినందుకుగాను ఆయనకు ఈ ఘనత దక్కింది. శనివారం కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని స్వర్ణభారతి ట్రస్టు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుల చేతులమీదుగా ఈ అవార్డుని నవీన్‌బాబు అందుకున్నారు. జర్నలిజంలోకి ప్రవేశించిన కొద్దిసంవత్సరాల్లో అవార్డుని అందుకున్న నవీన్‌ను ఆంధ్రజ్యోతి బ్రాంచ్‌ మేనేజరు ఐవీ సుబ్బారావుతోపాటు పలువురు జర్నలిస్టులు, రైతుసంఘాల నేతలు అభినందించారు. 






Updated Date - 2021-10-31T07:12:03+05:30 IST