ఘనంగా రాఘవేంద్రస్వామి ఆరాధన

ABN , First Publish Date - 2021-08-26T04:53:43+05:30 IST

గురు రాఘవేంద్రస్వామి 350 ఆరాధన మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు.

ఘనంగా రాఘవేంద్రస్వామి ఆరాధన
ప్రత్యేక అలంకరణలో రాఘవేంద్రస్వామి


మార్కాపురం (వన్‌ టౌన్‌), ఆగస్టు 25: గురు రాఘవేంద్రస్వామి 350 ఆరాధన మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. స్థానిక రాఘవేంద్ర స్వామి బృందావనంలో అర్చకులు స్వామి మూలవిరాట్‌కు ప్రత్యేక అలంకరణ నిర్వ హించారు. ఉత్తర ఆరా ధనను పురస్కరించు కొని విశేష పూజలు, అభిషే కాలు, అలంకరణలు నిర్వ హించారు. అనంతరం నగరోత్సవం నిర్వ హించారు. రాఘవేంద్ర స్వామి బృందావన సేవా సమితి సభ్యులు కొత్త లక్ష్మీ నారా యణ, కార్యదర్శి లక్ష్మీసు బ్బయ్య, కోశాధికారి ఇమ్మడిశెట్టి శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.


Updated Date - 2021-08-26T04:53:43+05:30 IST