రబీ రుణాలు రూ.5,142.66 కోట్లు

ABN , First Publish Date - 2021-10-19T06:30:13+05:30 IST

బీ సీజన్‌కు సంబంధించి అన్నదాతలకు రుణాలు అందించే ప్రక్రియ మొదలైందని లీడ్‌బ్యాంకు యంత్రాంగం చెబుతోంది.

రబీ రుణాలు రూ.5,142.66 కోట్లు

ఈనెల 1 నుంచే మంజూరు   

గతేడాది కంటే రూ.676.7 కోట్లు పెంపు

ఒంగోలు (జడ్పీ), అక్టోబరు 18: రబీ సీజన్‌కు సంబంధించి అన్నదాతలకు రుణాలు అందించే ప్రక్రియ మొదలైందని లీడ్‌బ్యాంకు యంత్రాంగం చెబుతోంది. 2021-22 రబీ సీజన్‌కు సంబంధించి రూ.5,142.66 కోట్లు రుణాలుగా అందించాలని వార్షిక ప్రణాళికలో ప్రకటించారు. ఈ మొత్తం గత రబీ సీజన్‌తో పోల్చితే రూ.676.7 కోట్లు అధికం. గత రబీ సీజన్‌కు రూ.4,465.96 కోట్లను వార్షిక పద్దులో యంత్రాంగం కేటాయించింది. ఇక ఖరీఫ్‌ సీజన్‌కు రూ.4,380.71 కోట్లను రుణాలుగా ఇవ్వాలని  నిర్దేశించుకుంది. ఇప్పటికే దాదాపు 90శాతం మేర లక్ష్యాన్ని చేరుకున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరు వరకు ఖరీఫ్‌ రుణాలను కూడా రైతులకు అందిస్తామని, రబీ రుణాల మంజూరు కూడా అక్టోబరు 1 నుంచే మొదలు పెట్టామని లీడ్‌బ్యాంకు మేనేజర్‌ యుగంధర్‌రెడ్డి తెలిపారు.


Updated Date - 2021-10-19T06:30:13+05:30 IST