ఏరియా వైద్యశాలలో పేదలకు నాణ్యమైన వైద్యం

ABN , First Publish Date - 2021-12-07T06:08:02+05:30 IST

కందుకూరు ఏరియా వైద్యశాలలో గతం కన్నా ప్రస్తుతం ఎక్కువ మంది వైద్యులు అందుబాటులో ఉన్నారని దాదాపు అన్ని విభాగాల్లో వైద్యులు ఉన్నందున పేదలకు కార్పోరేట్‌ వైద్య సేవలు అందించగలుతున్నామని ఆసత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ మానుగుంట మహీధర్‌రెడ్డి తెలిపారు.

ఏరియా వైద్యశాలలో పేదలకు  నాణ్యమైన వైద్యం

కందుకూరు, డిసెంబరు 6 : కందుకూరు ఏరియా వైద్యశాలలో గతం కన్నా ప్రస్తుతం ఎక్కువ మంది వైద్యులు అందుబాటులో ఉన్నారని దాదాపు అన్ని విభాగాల్లో వైద్యులు ఉన్నందున పేదలకు కార్పోరేట్‌ వైద్య సేవలు అందించగలుతున్నామని ఆసత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ మానుగుంట మహీధర్‌రెడ్డి తెలిపారు. సోమవారం వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో సబ్‌ కలెక్టర్‌ అపరాజితసింగ్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఇంద్రాణి, వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతినెల సరాసరిన 140 పైగా కాన్పులు ఆస్పత్రిలో జరుగుతున్నాయన్నారు. ఆస్పత్రిలో నూతన బ్లాక్‌ నిర్మాణం జరుగు తోందన్నారు. సబ్‌ కలెక్టర్‌ అపరాజితసింగ్‌ మాట్లాడుతూ.. కరోనా ఓమైక్రాన్‌ వేరియంట్‌ని ఎదుర్కొనెందుకు వ్యాక్సినేషన్‌ ఎంతో కీలకమని ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఆమె కోరారు.

Updated Date - 2021-12-07T06:08:02+05:30 IST