కేంద్రాల వద్ద క్యూ

ABN , First Publish Date - 2021-05-30T06:26:37+05:30 IST

జిల్లాలో టీకా వేయించుకునేందుకు ప్రజానీకం వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నారు. కరోనా పాజిటివ్‌ కేసులు రోజువా రీ వెయ్యి వరకు కేసులు నమోదు అవుతుండటంతో ప్రజలు టీకాలకు ప్రాధాన్యత ఇ స్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం కొవిషీల్డ్‌ మాత్రమే ఇస్తున్నారు. దీంతో ఆయాకేంద్రాల వద్దకు భారీగా తరలి వస్తున్నారు.

కేంద్రాల వద్ద క్యూ


వ్యాక్సినేషన్‌ కోసం ప్రజానీకం పరుగులు

రెండో డోసు కొవాగ్జిన్‌ వేసేందుకు శ్రీకారంఒంగోలు(కలెక్టరేట్‌), మే 29 : జిల్లాలో టీకా వేయించుకునేందుకు ప్రజానీకం వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నారు. కరోనా పాజిటివ్‌ కేసులు రోజువా రీ వెయ్యి వరకు కేసులు నమోదు అవుతుండటంతో ప్రజలు టీకాలకు ప్రాధాన్యత ఇ స్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం కొవిషీల్డ్‌ మాత్రమే ఇస్తున్నారు. దీంతో ఆయాకేంద్రాల వద్దకు భారీగా తరలి వస్తున్నారు. అయితే వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద టీకా కోసం వ చ్చిన ప్రజలు గుంపులుగా ఉంటున్నారు. ఒక వైపు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగు తున్నా ఆయా కేంద్రాల వద్ద నియంత్రణ పాటించేందుకు యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటున్న పరిస్థితి లేకపోవడంతో ఆందోళన కలిగిస్తోంది.   కాగా జిల్లాలో ఇప్పటికే కొవాగ్జిన్‌ మొదటి డోసు వేయించుకొని రెండో డోసు వేయి ంచుకోనేందుకు అవసరమైన టీకా జిల్లాకు వచ్చింది. శనివారం కొద్దిమేర డోసులు అం దుబాటులోకి రావడంతో ఆదివారం ఆయా ప్రాంతాలకు జిల్లా కేంద్రం నుంచి పం పనున్నారు. సోమ లేదా మంగళవారం నుంచి సెకండ్‌ డోసు కొవాగ్జిన్‌ వేసేందుకు వై ద్య ఆరోగ్యశాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. 


Updated Date - 2021-05-30T06:26:37+05:30 IST