సివిల్ వివాదంలో పీటీసీ ఇన్‌స్పెక్టర్
ABN , First Publish Date - 2021-12-30T05:43:15+05:30 IST
సివిల్ వివాదంలో పీటీసీలో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ తల దూర్చడంతో మరింత వివాదాస్పదంగా మారింది.

ఒంగోలు(క్రైం), డిసెంబరు 29: సివిల్ వివాదంలో పీటీసీలో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ తల దూర్చడంతో మరింత వివాదాస్పదంగా మారింది. మంగమూ రు సమీపంలో గల ఐదు ఎకరాల పొలం విషయంలో వివాదం నడుస్తున్నది. అందుకు సంబంధించి ఈ నెల 20న చిన్ని శ్రీరాములు ఒంగోలు తాలుకా పోలీ సుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో వివాదాస్పద స్థలంలో నిర్మాణాలు చేస్తున్నారని శ్రీరాములు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావును వెంట తీసుకెళ్లి అక్కడ పనిచేస్తున్న కూలీలను పనులు నిలుపుదల చేయాలని హుకుం జారీ చేశారు. అయితే ఈ భూమిపై తమకు హక్కు ఉందంటూ శ్రీరాములు అతని వద్ద ఉ న్న రికార్డును తాలుకా పోలీసులకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాలుకా ఇన్‌స్పె క్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇరువర్గాల వారు సక్రమైన రికార్డులు ఇవ్వలే దని, విచారణ చేస్తున్నమని చెప్పారు.
నా స్నేహితుడి స్థలం అన్యాక్రాతం అవుతుంటే వెళ్లా..
ఈనెల 20న నా స్నేహితుడు తండ్రి చిన్ని శ్రీరాములు వచ్చారు. మంగ మూరు సమీపంలో ఉన్న పొలం అన్యాక్రాంతం అవుతున్నట్లు చెప్పారు. ఈ వి షయంపై ఈ నెల 27న పొలం దగ్గరకు వెళ్లా. ఈ కేసు విషయంలో తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.
- శ్రీనివాసరావు, పీటీసీ ఇన్‌స్పెక్టర్