ఘనంగా పవన్‌కల్యాణ్ జన్మదినం
ABN , First Publish Date - 2021-09-03T06:37:10+05:30 IST
జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీహిరో పవన్‌కళ్యాణ్ జన్మదిన వేడుకలను దర్శిలో ఘనంగా నిర్వహించారు.

దర్శి, సెప్టెంబరు 2 : జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీహిరో పవన్‌కళ్యాణ్ జన్మదిన వేడుకలను దర్శిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొటుకు.రమే్‌షబాబు పుట్టినరోజు కేకు కట్ చేసి అభిమానులకు పంచారు. స్థానిక షిరిడి సాయిబాబా ఆశ్రమంలోని వృద్ధులకు బియ్యం, పండ్లు పంపిణీ చేశారు. ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు చిరంజీవి, ఎం.శేషయ్య, టి.పాపారావు, పాపిశెట్టి.రవి, సీహెచ్ కొండల పాల్గొన్నారు.
లింగసముద్రం : జనసేన అధినేత పవన్‌కల్యాణ్ 50వ జన్మదిన వేడుకలు గురువారం సాయంత్రం లింగసముద్రంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. పవన్‌కల్యాణ్ అభిమానులు మార్తాటి గణేష్, నారాయణ, మహే్‌షలు కేక్ కట్ చేసి పలువురికి పంఫిణీ చేశారు. కార్యక్రమంలో సుమారు 50 మంది అభిమానులు పాల్గొన్నారు.