రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-08-10T06:50:41+05:30 IST

దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం రైతులకు నష్టంచేసే చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో సోమవారం కందుకూరులో సేవ్‌ ఇండియా నిరసన కార్యక్రమం నిర్వహించారు.

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
దర్శిలో నిరన తెలుపుతున్న ప్రజాసంఘాల నాయకులు

వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసలు

సేవ్‌ ఇండియా కార్యక్రమానికి విశేష స్పందన

కందుకూరు, ఆగస్టు 9: దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం రైతులకు నష్టంచేసే చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో సోమవారం కందుకూరులో సేవ్‌ ఇండియా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏఐటీయూసీ మహిళాసంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో  స్థానిక సబ్‌ కలెక్టరు కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బి.సురే్‌షబాబు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ నల్లచట్టాలను రద్ధు చేయాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వరంగంలో కొనసాగించాలని, కార్మిక చట్టాలను 4 కోడ్‌లుగా కుదించడాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో ఎఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్‌  సుభాన్‌, హరిబాబు, మురళి, వెంకటలక్ష్మి, బ్రహ్మచారి, కొండయ్య, శ్రీను పాల్గొన్నారు.

దర్శి : రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిం చారు. కార్యక్రమంలో సీఐటీయూ కార్యదర్శి టి.రంగారావు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశాన్ని దోపీడి చేస్తోందన్నారు. అంబాని, ఆధాని సంస్థలకు ప్రభుత్వ రంగ ఆస్తులను కారుచౌకగా కట్టబెడు తోందన్నారు. వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్‌ పరం చేసేందుకే ఈ నల్లచట్టాలను తెచ్చిందన్నారు. నాయకులు సందు.వెంకటేశ్వరరావు, ఇశ్రాయేలు, కె.వి.పిచ్చయ్య, గోగు.వెంకయ్య, పుల్లయ్య, గర్నెపూడి జాన్‌, రత్నకుమారి, గంగమ్మ పాల్గొన్నారు.

దొనకొండ : రైతు వ్యతిరేక నల్లచట్టాలను రద్దు చేయాలంటూ దొనకొండ మండల సీఐటీయూ ఆధ్వర్యంలో సీపీఎం నాయకులు చిరుపల్లి.అంజయ్య నేతృత్వంలో సోమవారం నిరసన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో సీపీయం నాయకులు కర్నా.హనుమయ్య, కార్యకర్తలు రామయ్య, కిరణ్‌కుమార్‌, అంజిబాబు, రాఘవులు, శ్రీకాంత్‌, ప్రభాకర్‌ పాల్గొన్నారు.

ముండ్లమూరు : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ రైతు వ్యతిరేకచట్టాల  బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని మండల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్‌ పార్వతికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పంటా ఏడుకొండలు, వెల్లంపల్లి ఆంజనేయులు, మీరావలి తదితరులు పాల్గొన్నారు. 

వెలిగండ్ల :  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలని కోరుతూ సోమవారం అంగన్‌వాడీ  కార్యాలయం వద్ద నుం చి తహసీల్దార్‌ కార్యాలయం వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశాలు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నారాయమణమ్మ, రాయళ్ల మాలకొండయ్యలు పాల్గొన్నారు. 

లింగసముద్రం : మోడీ ప్రభుత్వ, రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు నశించాలని, దేశాన్ని రక్షించాలని సేవ్‌ ఇండియా కార్యక్రమం సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. ప్రభుత్వ రంగ ఆస్తులన్నింటినీ అమ్మేస్తున్నారని అన్నారు. కార్మిక చట్టాలను సవరణల పేరుతో రాజ్యాంగం కల్పించిన హక్కులను హరిస్తున్నదన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను పెంచి ప్రజల నడ్డివిరుస్తున్నారని విమర్శించారు.  కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

 కనిగిరి : పట్టణంలో సీఐటీయూ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం సేవ్‌ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం స్థానిక పామూరు బస్టాండ్‌ కూడలిలో జరిగిన ధర్నా, నిరసన, మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పీసీ కేశవరావు, ఎస్‌కే.ఖాశీంవలి ఏపీ రైతు సంఘం నాయకులు నాగిరెడ్డి, శ్రీరాములరెడ్డి, మాలకొండయ్య, సీఐటీయూ నాయకులు ఖాదర్‌వలి, పీరావలి, వెంకటేశ్వర్లు, కొండారెడ్డి, ప్రసన్న, రమణమ్మ, కాశయ్య, పిచ్చయ్య, ప్రసాద్‌, శ్రీను తదితరులు పాల్గొన్నారు. 

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో : దేశంలో బీజేపీ పాలన నాడు తెల్లదొరల పాలనను తలపిస్తోందని ఏఐటీయూసీ నాయకులు యాసిన్‌, గుజ్జుల బాలిరెడ్డిలు ఆరోపించారు. దేశవ్యాప్తంగా క్విట్‌ ఇండియా ఉద్యమస్పూర్తితో సేవ్‌ ఇండియా కార్యక్రమాన్ని కనిగిరిలో భారీ ర్యాలీ, నిరసన ప్రదర్శన సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు అంకమ్మ, సునీత, అంజమ్మ, ఏఐటీయూసీ నాయకులు వెంకటేశ్వర్లు, నాజర్‌, కిరణ్‌, రత్తయ్య, పవన్‌, సీపీఐశాఖ కార్యదర్శులు షరీప్‌, బాలకోటయ్య, పిచ్చిరెడ్డి, అంజి తదితరులు పాల్గొన్నారు. 

పామూరు : దేశాన్ని అన్ని రంగాల్లో దివాళా తీయించి నష్టాల సాకుతో ప్రభుత్వరంగ సంస్థలను బడా కార్పోరేట్‌ సంస్థలకు కారుచౌకగా విక్రయిస్తున్న ప్రజాద్రోహి నరేంద్రమోడీ అని వ్యవసాయ సంఘం నాయకులు మాల్యాద్రి ఆరోపించారు. సేవ్‌ ఇండియా దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా వామపక్ష, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ, నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ అల్లాభకస్‌, కె శంకర్‌, వై వీరణారాయణ, సిహెచ్‌ వెంకటేశ్వర్లు, చాంద్‌బాష, దేవరాజు, ఐద్వా కమిటీ నాయకుడు  తదితరులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ ఆద్వర్యంలో సేవ్‌ ఇండియా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఏఐటీయూసీ అద్యక్షుడు వజ్రాల సుబ్బారావు, మస్తాన్‌రావు,  పాల్గొన్నారు.

వలేటివారిపాలెం : క్విట్‌ ఇండియా డే స్పూర్తితో మోడీ ప్రభుత్వ విదానాలను తిపికొట్టాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుమార్‌ తెలిపారు. వలేటివారిపాలెం తహసీల్దార్‌ కార్యాలయం ముందు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.  రైతు నాయకులు మాదాల రమణయ్య  సాదు చెన్నకేశవులు, మల్లిక, రాదా, బారతి, జ్యోతి, చెంచులక్ష్మి, కొండయ్య, కొంకా మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. 

సీఎ్‌సపురం, ఆగస్టు 9 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు వ్యతిరేకించాలని సీఐటీయు మండల కార్యదర్శి ఎస్‌.తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. సేవ్‌ ఇండియా కార్యక్రమంలో బాగంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్‌ సెంటర్‌లో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఊసా రాజ్యలక్ష్మి, ఏసురత్నం, బి.జి.రాజు, నారాయణ, నారాయణమ్మ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-10T06:50:41+05:30 IST