నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2021-02-06T07:01:34+05:30 IST

మండలంలోని 6 క్లస్టర్లలో నామినేషన్లు స్వీకరణకు స్టేజ్‌-1 అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి
మాట్లాడుతున్న ఎంపీడీవో రంగసుబ్బారాయుడు

కొండపి, ఫిబ్రవరి 5 : మండలంలోని 6 క్లస్టర్లలో నామినేషన్లు స్వీకరణకు స్టేజ్‌-1 అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. శనివారం ఉదయం నోటిఫికేషన్‌ జారీ చేసి నోటీసు బోర్డులో ఉంచుతారు. అనంతరం నామినేషన్లు స్వీకరిస్తారు. ఏర్పాట్లుపై ఎన్నికల ప్రత్యేకాధికారి, డీఆర్‌డీఏ పీడీ నారాయణరావు శుక్రవారం మధ్యాహ్నం ఎంపీడీవో సమావేశం హాలులో అధికారులతో సమావేశమై సూచనలు చేశారు. 

పొన్నలూరు : మండలంలోని 5 క్లష్టర్లలో 24  పంచాయతీలు, 216 వార్డులకు నామినేషన్లు స్వీకరించేందుకు స్టేజ్‌-1 అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారని ఎంపీడీవో రత్నజ్యోతి చెప్పారు. పొన్నలూరు సచివాలయంలో పొన్నలూరు, రావులకొల్లు, ఉప్పలదిన్నె, నాగిరెడ్డిపాలెం, పైరెడ్డిపాలెం గ్రామ పంచాయతీలు, ముప్పాళ్ల సచివాలయంలో ముప్పాళ్ల, సింగరబొట్లపాలెం, వెల్లటూరు, వేంపాడు, చెన్నుపాడు గ్రామ సచివాలయంలో చెన్నుపాడు, కోటపాడు, రాజోలుపాడు, వెంకుపాలెం, జడ్‌.మేకపాడు గ్రామ పంచాయతీలకు చెందిన నామినేషన్లను స్వీకరిస్తారని తెలిపారు. అదేవిధంగా కే.అగ్రహారం సచివాలయంలో కె. అగ్రహారం, బోగనంపాడు, తిమ్మపాలెం, సుంకిరెడ్డిపాలెం, ముళ్లమూరివారిపాలెం, విప్పగుంట సచివాలయంలో విప్పగుంట, పెదవెంకన్నపాలెం, చౌటపాలెం, మాలపాడు, చెరుకూరు గ్రామ పంచాయతీలకు చెందిన నామినేషన్లు స్వీకరిస్తామన్నారు.

జరుగుమల్లి(కొండపి) : జరుగుమల్లి మండలంలోని ఐదు క్లస్టర్లు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో పమిడి పద్మజ తెలిపారు. కామేపల్లి గ్రామ సచివాలయంలో క్లస్టర్‌ పరిధిలోని కామేపల్లి, వర్ధినేనివారిపాలెం, ఎన్‌.ఎన్‌.కండ్రిగ, పచ్చవ గ్రామ పంచాయతీలకు, పైడిపాడు సచివాలయంలో పైడిపాడు, చతుకుపాడు, రెడ్డిపాలెం, అక్కచెరువుపాలెం పంచాయతీలకు, చిర్రికూరపాడు గ్రామ సచివాలయంలో చిర్రికూరపాడు, రామచంద్రాపురం, నర్సింగోలు, ఎడ్లూరుపాడులకు, జరుగుమల్లి గ్రామ సచివాలయంలో జరుగుమల్లి, దావగూడూరు, చింతలపాలెం, నందనవనంలు, కె. బిట్రగుంట గ్రామ సచివాలయంలో తూమాడు, పాలేటిపాడు, వావిలేటిపాడు, కె. బిట్రగుంట గ్రామ పంచాయతీల సర్పంచ్‌, మెంబర్ల అభ్యర్థుల నామినేషన్లు అధికారులు స్వీకరిస్తారని ఎంపీడీవో చెప్పారు.

సింగరాయకొండ : నామినేషన్‌ ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలని అధికారులకు ఎంపీడీవో షేక్‌ జమీవుల్లా సూచించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఆర్వోలకు, పీఆర్వోలకు, డిజటల్‌ అసిస్టెంట్‌లకు  శిక్షణ ఇచ్చారు. 

సీఎ్‌సపురం : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్‌, వార్డులకు శనివారం నుంచి మూడు రోజులపాటు అభ్యర్థుల నుంచి నామినేషన్ల పత్రాలు స్వీకరించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీవో కట్టా శ్రీనువాసులు తెలిపారు. మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు  ఆరు కేంద్రాలలో నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు.

పామూరు : మండలంలో గ్రామ పంచాయితీ ఎన్నికలకు సంబంధించి  నేటి నుంచి మూడురోజుల పాటు జరిగే నామినేషన్‌ ప్రక్రియను ఎన్నికల అధికారులు సమర్ధవంతంగా చేపట్టాలని ఎంపీడీవో ఎం.రంగసుబ్బారాయుడు కోరారు. స్థానిక స్ర్తీశక్తి భవన్‌లో గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలపై నియమించిన సిబ్బందికి శుక్రవారం శిక్షణా తరగతులు నిర్వహించారు. మోపాడు గ్రామ పంచాయితీలో మోపాడు, లక్ష్మినర్సాపురం, ఇనిమెర్ల, బలిజపాలెం, తూర్పు కట్టకిందపల్లి పంచాయతీలు వగ్గంపల్లి గ్రామ పంచాయితీ కార్యాలయంలో వగ్గంపల్లి, రావిగుంటపల్లి, మార్కొండాపురం, నర్రమారెళ్ల, చింతలపాలెం పంచాయతీలు, గూడూరు గ్రామ పంచాయితీ కార్యాలయంలో బొట్లగూడూరు, కంభాలదిన్నె బోడవాడ, అయ్యన్నకోట, అయ్యవారిపల్లి, కోడిగుంపల పంచాయితీలు, చిలంకూరు గ్రామ పంచాయితీ కార్యాలయంలో చిలంకూరు, వీరభద్రాపురం, పడమరకట్టక్రిందపల్లి, దాదిరెడ్డిపల్లి పంచాయితీలకు సంబంధించి నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు.

కనిగిరి :  మండలంలోని యడవల్లి, దిరిశవంచ, చల్లగిరిగల, బడుగులేరు, గానుగపెంట తుమ్మకుంట గ్రామ పంచాయతీలకు నందనమారెళ్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల కేంద్రంలో నామినేషన్లు అందజేయాలి.  చాకిరాల, ఎన్‌గొళ్లపల్లి, పోలవరం గ్రామాలకు  చాకిరాల పంచాయితీ కార్యాలయంలో, చిన అలవలపాడు, తక్కెళ్లపాడు, బల్లిపల్లి, చీర్లదిన్నె గ్రామ పంచాయితీలక కంచర్లవారిపల్లి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో, గురవాజీపేట, వంగపాడు, జమ్మలమడక, క్రిష్ణాపురం  నామినేషన్లు గురవాజీపేట గ్రామ పంచాయితీ కార్యాలయంలో, ఏరువారిపల్లి, చిన ఇర్లపాడు, గోసులవీడు, పేరంగుడిపల్లి, గ్రామాలకు చెందిన నామినేషన్లు ఆజీ్‌సపురం ప్రాధమిక పాఠశాల కేంద్రంలో, పునుగోడు, బొమ్మిరెడ్డిపల్లి, తాళ్లూరు, గుడిపాడు గ్రామాలకు చెందిన పంచాయితీ సర్పంచ్‌, వార్డు సభ్యుల అభ్యర్ధులు తాళ్లూరు జిల్లా పరిషత్‌ హై స్కూల్‌లో వారివారి నామినేషన్లు అందజేయాలని స్పెషల్‌ అధికారి తెలిపారు. 

Updated Date - 2021-02-06T07:01:34+05:30 IST