ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్‌ మీటర్లు

ABN , First Publish Date - 2021-04-18T05:20:40+05:30 IST

ప్రభుత్వ కార్యాలయాల కు ప్రీ పెయిడ్‌ విద్యుత్‌ మీటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఏపీసీపీడీసీఎల్‌ ఎస్‌ఈ సత్యనారాయణ పేర్కొన్నారు. అద్దంకి డివిజన్‌ పరిధిలోని విద్యుత్‌శాఖ అధికారులతో శనివారం స్థానిక శింగరకొండరోడ్డులోని విద్యుత్‌భవన్‌ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ మాట్లాడుతూ విద్యుత్‌ బకాయిల వసూలుపై క్షే త్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లావ్యాప్తంగా రూ.310 కోట్ల బకాయిలు ఉన్నాయని, వాటి వసూలుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్‌ మీటర్లు
సమీక్ష నిర్వహిస్తున్న ఎ్‌సఈ సత్యనారాయణ

బకాయిల వసూలుకు ప్రత్యేక బృందాలు

ఎ్‌సఈ సత్యనారాయణ


అద్దంకి, ఏప్రిల్‌ 17: ప్రభుత్వ కార్యాలయాల కు  ప్రీ పెయిడ్‌ విద్యుత్‌  మీటర్లు  ఏర్పాటు చేయనున్నట్లు ఏపీసీపీడీసీఎల్‌  ఎస్‌ఈ  సత్యనారాయణ పేర్కొన్నారు. అద్దంకి డివిజన్‌ పరిధిలోని విద్యుత్‌శాఖ  అధికారులతో శనివారం స్థానిక శింగరకొండరోడ్డులోని విద్యుత్‌భవన్‌ లో సమీక్ష  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ మాట్లాడుతూ విద్యుత్‌ బకాయిల వసూలుపై క్షే త్రస్థాయిలో  ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లావ్యాప్తంగా రూ.310 కోట్ల బకాయిలు ఉన్నాయని,  వాటి వసూలుకు ప్రత్యేక బృందాలను  ఏర్పాటు చేసినట్లు వివరించారు. గత ఆర్థిక స ంవత్సరంలో  అద్దంకి డివిజన్‌లో 11శాతం అద నంగా వసూలు చేయటంపై అధికారులు, సిబ్బ ందిని ఎస్‌ఈ అభినందించారు. జిల్లావ్యాప్తంగా  78 కొత్త  సబ్‌స్టేషన్‌లు మంజూరు అయ్యాయ ని, తొలి దశలో ప్రతి డివిజన్‌ పరిధిలో రెండు సబ్‌స్టేషన్‌ల నిర్మాణం చేపడతామని వివరించా రు. అద్దంకి డివిజన్‌ పరిధిలో తొలి దశలో మే దరమెట్ల, మార్టూరులలో అదనంగా కొత్త సబ్‌స్టేషన్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాలలో వ్యవసాయ, గృహవినియోగానికి ప్రత్యేక  వి ద్యుత్‌ లైన్‌లు ఏర్పాటు చేయటం ద్వారా  గ్రా మాల్లో సైతం నిరంతరాయంగా మూడు ఫేస్‌ల కరెంటు సరఫరా చేస్తామన్నారు. అద్దంకి  డివిజన్‌లో హెచ్‌డీవీఎ్‌స ద్వారా  అవసరమైన మే ర వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్‌లు  ఏర్పాటు  చే సే ప్రక్రియ రెండు నెలలలో పూర్తవతుందన్నా రు. కొత్తగా నిర్మించనున్న జగనన్న కాలనీలలో అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ సిస్టం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఈఈ నల్లూరి మస్తాన్‌రావు, ఒంగోలు సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ ప్రసాదరావు, డీఈఈలు పద్మావతి, ఉదయ్‌కుమార్‌, ఏఈలు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-18T05:20:40+05:30 IST