ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో టీడీపీ కార్యకర్తల ఆందోళన
ABN , First Publish Date - 2021-10-20T13:27:29+05:30 IST
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపు నేపథ్యంలో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

ఒంగోలు: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపు నేపథ్యంలో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బస్సులను అడ్డుకుంటున్న టీడీపీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. బస్టాండ్లో భారీగా పోలీసులు మోహరించారు. బస్సులను యధాతథంగా నడిపేందుకు యత్నిస్తున్నారు.