ప్రకాశం జిల్లా: సచివాలయ సిబ్బందిపై వాలంటీర్ దౌర్జన్యం

ABN , First Publish Date - 2021-10-28T15:51:53+05:30 IST

కనిగిరి మండలం, ఎన్ గొల్లపల్లిలో సచివాలయ సిబ్బందిపై వాలంటీర్ దౌర్జన్యం ప్రదర్శిస్తున్నాడు.

ప్రకాశం జిల్లా: సచివాలయ సిబ్బందిపై వాలంటీర్ దౌర్జన్యం

ప్రకాశం జిల్లా: కనిగిరి మండలం, ఎన్ గొల్లపల్లిలో సచివాలయ సిబ్బందిపై వాలంటీర్ ఉదయ్ కిరణ్ దౌర్జన్యం ప్రదర్శిస్తున్నాడు. సిబ్బందిపై పెత్తనం చేస్తూ.. తాను చెప్పినట్లు వినకపోతే ఉన్నతాధికారులకు అనవసర ఫిర్యాదులు చేస్తున్నాడు. మహిళా సిబ్బందిపై తరచూ దుర్భాషలాడుతున్నాడు. అధికార పార్టీ నేతల అండదండలతో వాలంటీర్ రెచ్చిపోతున్నాడు. వాలంటీర్ ప్రవర్తనతో విసుగు చెందిన సచివాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2021-10-28T15:51:53+05:30 IST