కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై నిరసన

ABN , First Publish Date - 2021-08-10T05:49:32+05:30 IST

మోదీ ప్రభు త్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలి పాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై నిరసన
మార్కాపురంలో రాస్తారోకో చేస్తున్న నాయకులు


గిద్దలూరు టౌన్‌, ఆగస్టు 9 : మోదీ ప్రభు త్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలి పాయి. ఈ సందర్భంగా సీఐటీయూ పశ్చిమ ప్రకాశం జిల్లా సహాయ కార్యదర్శి ఆవులయ్య మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ  అధికారంలోకి వచ్చిన తరువాత రైతులు, కార్మిక వర్గానికి నష్టం చేసే నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ప్రజా, కార్మిక వ్యతిరేక నిర్ణయాలను విర మించుకోవాలని డిమాండ్‌ చేస్తూ అన్ని మం డల కేంద్రాల వద్ద నిరసన తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు, విద్యుత్‌ బిల్లు రద్దు చేయాలని, 4 లేబర్‌ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు కార్పోరేట్‌ సంస్థలకు అప్పగించరాదని, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యవసర ధరలు తగ్గించాలని, ఆదాయపన్ను కట్టని కుటుంబాలకు నెలకు రూ.7500 చొప్పున 6 నెలలపాటు ఇవ్వాలని, ఉపాధి హామీ పథకా న్ని పట్టణ ప్రాంతాలలో అమలు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ అధ్య క్ష, కార్యదర్శులు మురళి, నరసింహులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు విశ్రాంతి, రాజమణి, శ్రీనివాసులు, నూర్జహాన్‌ పాల్గొన్నారు.

కంభంలో..

కంభం :  బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ప్రజా సంఘాల నాయకులు సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేప ట్టారు. విద్యుత్‌ సంస్కరణల బిల్లును వెన క్కి తీసకోవాలని, పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు వెంకటరామిరెడ్డి,  సీఐటీయూ కార్యదర్శి వెంకట్‌, గాలయ్య, వెంకటేష్‌, హర్షద్‌, నారాయణ, నాగలక్ష్మమ్మ, లక్ష్మిదేవి, తిరుపతమ్మ, రంగమ్మ, రైతులు పాల్గొన్నారు. 

మార్కాపురంలో..

మార్కాపురం(వన్‌టౌన్‌) : బీజేపీ విధా నాలకు నిరసనగా సేవ్‌ ఇండియా, సేవ్‌ డెమో క్రసీ అంటూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ప్రదర్శన నిరసన కార్యక్రమం చేప ట్టాయి. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రఫి, రూబెన్‌, సుబ్బరాయుడు,  ఏఐటీయూసీ నాయకులు అందె నాసరయ్య, కాశీం, ఎంపీజే నాయకులు రజాక్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు కాలేబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సోమయ్య, డీవైఎఫ్‌ఐ  అధ్యక్షుడు వై.సురేష్‌, తాపీమేస్ర్తిల సంఘం అధ్యక్షుడు పి.వెంకటేశ్వర్లు, జీపు వర్కర్‌ మోటార్స్‌ సంఘ అధ్యక్షుడు అమిరుల్లా ఖాన్‌ పాల్గొన్నారు. 

మోదీ గద్దె దింపుదాం :  శ్రీనివాసరావు

పొదిలి (రూరల్‌) : ప్రజా వ్యతిరేక విధా నాలను అవలంబిస్తున్న ప్రధాన మంత్రి మోదీ ని గద్దె దించేందుకు ప్రతి ఒక్కరు ముం దుకు రావాలని  ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ఉ పాధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ముందు సోమ వారం దేశాన్ని రక్షించుకుంద్దాం - వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ని ర్వహించిన సేవ్‌ ఇండియా ఆందోళన కార్యక్ర మంలో మాట్లాడారు. కార్పొరేట్‌ దయా దాక్షన్యా లకు పోయి కార్మికులను బానిసలుగా మారు స్తున్నారన్నారు. నల్ల చట్టాల రద్దు కోరుతూ ఢిల్లీలో రైతులు పోరా డుతుంటే మోదీ మెం డిగా వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబ ట్టారు. యూటీఎప్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ అబ్దుల్‌ హై మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో సీఐటీయూ గౌరవాధ్యక్షుడు శేషయ్య, పచ్చిమ   హానీఫ్‌,  పెన్షనర్ల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏబాదుల్లా, వారబ్రహ్మం, కార్మిక సంఘ నా యకులు నాగులుడి సుబ్బయ్య, నరసింహం, ఏసేబు, రాజయ్య పాల్గొన్నారు. 

వై.పాలెంలో.. 

ఎర్రగొండపాలెం :  రైతులను, ప్రజల బా గోగులు పట్టించుకోకుండా కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తున్న మోదీ ప్రభుత్వం గద్దె ది గాలని  రైతు సంఘం జిల్లా  అధ్యక్షుడు దే వండ్ల శ్రీనివాసులు  డిమాండ్‌ చేశారు.  సీపీఐ  కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.  కార్యక్ర మంలో సీపీఐ నాయకులు కృష్ణగౌడ్‌,   గురవ య్య,తిరుపతయ్య, నాగేశ్వరరావు పాల్గొన్నారు.Updated Date - 2021-08-10T05:49:32+05:30 IST