పోలీసు త్యాగాలు చిరస్మరణీయం

ABN , First Publish Date - 2021-10-22T05:09:28+05:30 IST

శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు అమూల్యమైనవని, వారి త్యాగాలు చిరస్మరణీయమని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొనియాడారు. గురువారం స్థానిక పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, అమరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీసుల భద్రత, సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు.

పోలీసు త్యాగాలు చిరస్మరణీయం
పోలీస్‌ అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పిస్తున్న మంత్రి బాలినేని, ఎంపీ మాగుంట, కలెక్టర్‌, ఎస్పీ

 అమర వీరులకు ఘన నివాళి

కొవిడ్‌తో మృతిచెందిన వారికి రూ.10లక్షలు

కారుణ్య నియామకాల కింద ఐదుగురికి ఉద్యోగాలు

పరేడ్‌గ్రౌండ్‌ నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ వరకు ర్యాలీ

ఒంగోలు(క్రైం) అక్టోబరు 22: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు అమూల్యమైనవని, వారి త్యాగాలు చిరస్మరణీయమని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొనియాడారు. గురువారం స్థానిక పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, అమరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీసుల భద్రత, సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. కొవిడ్‌ కట్టడిలో పోలీసులు చేసిన సేవలకు వెలకట్టలేమని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ కొనియాడారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎస్పీ మలిక గర్గ్‌ మాట్లాడుతూ ఈ ఏడాది దేశంలో 377మంది పోలీసులు విధి నిర్వహణలో అసువులు బాశారని, రాష్ట్రంలో 11మంది ఉన్నారని తెలిపారు. జిల్లాలో కొవిడ్‌ బారిన పడి 10మంది పోలీసులు మృతిచెందారని వారికి రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా అందజేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా కారుణ్య నియమకాల కింద ఐదుగురికి ఉద్యోగాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఎక్స్‌గ్రేషియా చెక్కులను మంత్రి చేతులమీదగా అందజేశారు. మేయర్‌ గంగాడ సుజాత, ఏఎస్పీ బి.రవిచంద్ర, ఓఎస్డీ కె.చౌడేశ్వరి, ఏఆర్‌ ఏఎస్పీ టి.శివారెడ్డి పాల్గొన్నారు. 

పోలీసు శిక్షణా కళాశాలలో.. 

పోలీసు శిక్షణ కళాశాలలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినంలో భాగంగా ఓపెన్‌ హౌస్‌ నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్‌ ఏఆర్‌.దామోదర్‌ అధ్యక్షత వహించారు. స్కూల్‌ పిల్లలకు ఆయుధాలు చూపించి వివరించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ చిరంజీవి, డీఎస్పీ జ్యోతి రాణి పాల్గొన్నారు.

 

Updated Date - 2021-10-22T05:09:28+05:30 IST