కిడ్నాప్ కేసు నమోదులో అలసత్వం
ABN , First Publish Date - 2021-01-31T05:43:21+05:30 IST
కిడ్నాప్ కేసు నమోదు విషయంలో పోలీసుల తీరుపై మండిపడుతూ పెదగంజాం గ్రామస్థులు నా గులుప్పలపాడు పోలీసుస్టేషన్ ఎదుట ఆందో ళనకు దిగారు.
స్టేషన్ ఎదుట పెదగంజాం గ్రామస్థుల బైఠాయింపు
ఎస్‌ఐని నిలదీసిన ఎమ్మెల్యే ఏలూరి
వైసీపీది అరాచకపు పాలనంటూ ధ్వజం
నాగులుప్పలపాడు, జనవరి 30 : కిడ్నాప్ కేసు నమోదు విషయంలో పోలీసుల తీరుపై మండిపడుతూ పెదగంజాం గ్రామస్థులు నా గులుప్పలపాడు పోలీసుస్టేషన్ ఎదుట ఆందో ళనకు దిగారు. చిన్నగంజాం మండలం పెద్ద గంజాం పంచాయతీ టీడీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి వై.తిరపతిరావును శనివారం ఆ గ్రా మానికి చెందిన వైసీపీ నాయకులు కిడ్నాప్ చేశారు. పెద్దగంజాం టీడీపీ నాయకులు, కా ర్యకర్తలు సమాచారం అందుకొని గాలింపు చ ర్యలు చేపట్టి చిన్నగంజాం, నాగులుప్పలపా డు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే ఈ ఘటన తమ పరిధిలోని ది కాదంటూ ఒకరిపై ఒకరు చెప్పుకుని సా యంత్రం వరకు ఫిర్యాదు తీసుకోలేదు. దీంతో విషయం తెలుసుకున్న పర్చూరు ఎమ్మెల్యే ఏ లూరి సాంబశివరావు హుటాహుటిన సా యంత్రానికి ఎన్‌జీపాడు పోలీసుస్టేషన్‌కు చే రారు. కిడ్నాప్ జరిగిన ప్రదేశం కుక్కలవారి పాలెం ఎన్‌జీపాడు స్టేషన్ పరిధిలోకి వస్తుం దని, ఫిర్యాదు ఎందుకు తీసుకోలేదని స్టేషన్ లో ఉన్న ఎస్సై శశికుమార్‌ను నిలదీశారు. ఆ సంఘటన తమ పరిధిలో జరగలేదని ఫిర్యా దు తీసుకునే విషయంపై జిల్లా పోలీసులకు సమాచారం అందించి చర్యలు చేపడతానని ఎమ్మెల్యేకి ఎస్సైకు తెలియజేశారు. దీంతో పె దగంజాం వాసులు కిడ్నాప్ వ్యవహారంలో పోలీసుల అలసత్వాన్ని నిరసిస్తూ స్టేషన్ ఎ దుట నిరసన చేపట్టారు. అనంతరం స్టేషన్ బయట మీడియాతో ఎమ్మెల్యే ఏలూరి మా ట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అరాచకం రాజ్యమేలుతుందని, ప్రజా స్వామ్యంలో దౌర్జన్యంగా ప్రతిపక్షం గొంతు నొ క్కుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలంటే వైసీపీకి భయం పట్టుకుందని, అందుకే ఆ పార్టీ నేతలు ఇంత దిగజారుడు చేష్టలు చే స్తున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులు సకా లంలో స్పందించకపోవడంపై ఆగ్రహం వ్య క్తం చేశారు. కిడ్నాప్ వ్యవహారంలో అధికార వైసీపీ నేత అంకమరెడ్డి అతని అనుచరులపై చర్యలు తీసుకునే వరకు న్యాయ పోరాటం చే స్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. ఇంతలో కి డ్నాప్‌నకు గురైన తిరుపతిరావు చిన్నగంజాం పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారనే సమాచారం రావడంతో అక్కడికి బయలుదేరి వెళ్లారు.