చేపల కుంటలో విషప్రయోగం?

ABN , First Publish Date - 2021-12-29T04:38:32+05:30 IST

వ్యవసాయ పొలంలోని చేపల కుంటలో విషప్రయోగం జరిగింది. వేల సంఖ్యలో చేపలు, పిల్లలు మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన మండలంలోని అల్లినగరం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

చేపల కుంటలో విషప్రయోగం?
చనిపోయిన చేపలు

రూ.లక్ష నష్టం.. లబోదిబోమంటున్న బాధితుడు

కొమరోలు, డిసెంబరు 28 : వ్యవసాయ పొలంలోని చేపల కుంటలో విషప్రయోగం జరిగింది. వేల సంఖ్యలో చేపలు, పిల్లలు మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన మండలంలోని అల్లినగరం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అల్లినగరం గ్రామానికి చెందిన కలగొట్ల కాశింకు చెందిన సొంత పొలంలో కుంటలను తవ్వించి దానిలో చేపలను పెంచుకుని అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కుంటలో నుంచి కొన్ని చేపలు బయటకు వచ్చాయి. ఆ కారణంగా పిల్లలు చనిపోయినట్లు కాశిం భావించాడు. మరుసటి రోజు ఉదయం చూసే సరికి కుంట ఒడ్డున గుట్టలుగుట్టలుగా పెద్ద చేపలు, పిల్లలు మృతి చెంది ఉండడం చూసి లబోదిబోమన్నాడు. ఎవరో విషప్రయోగం చేసి ఉంటారని అనుమానించి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. హౌస్‌ ఇన్‌చార్జి సురేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గిద్దలూరు సీఐ ఫిరోజ్‌ చేపల కుంటను పరిశీలించారు. చేపల మృతితో సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిలినట్లు బాధితుడు తెలిపాడు. 

Updated Date - 2021-12-29T04:38:32+05:30 IST