పింగళి వెంకయ్యకు ఘన నివాళి
ABN , First Publish Date - 2021-08-03T05:50:44+05:30 IST
భారతీ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా టీడీపీ శ్రేణులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

గిద్దలూరు, ఆగస్టు 2 : భారతీ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా టీడీపీ శ్రేణులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి నివాస గృహంలో జరిగిన కార్యక్రమంలో పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ మండల, పట్టణశాఖ అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి, షేక్ మస్తాన్, నాయకులు షేక్ మహబూబ్‌బాషా, గోపాల్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, చంద్రశేఖర్‌యాదవ్, పాలుగుళ్ళ చిన్నశ్రీనివాసరెడ్డి, బిర్లా రమేష్ పాల్గొన్నారు.
కంభంలో..
కంభం : పింగళి వెంకయ్య రూపొందించిన భారత జాతీయ పతాకం జాతికి గర్వకారణమని తహసీల్దార్ ప్రసాద్, మండల విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమవారం స్థానిక మండల విద్యావనరుల కేంద్రం ఆవరణలో భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి ఉత్సవాలను కంభం లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా తహసీల్దార్ ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించగా ఎంఈవో వెంకటేశ్వర్లు, లయన్స్‌క్లబ్ సభ్యులు పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎల్‌కోట జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం, వ్యక్తిత్వ వికాస నిపుణులు రామకృష్ణ పింగళి సేవలు చిరస్మరనీయమని కొనియాడారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసప్రసాద్, సభ్యులు మొగల్ హుస్సేన్‌భేగ్, బాలరంగారావు, శ్రీనివాసులు, పలువురు పాల్గొన్నారు.
మార్కాపురంలో..
మార్కాపురం (వన్‌టౌన్) : స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. శివాలయం వీధిలో పింగళి వెంకయ్య చిత్రపటానికి ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి రెంట చింతల మధుసుదనశర్మ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ కార్యక్ర మంలో ఏలూరి ఆంజనేయశర్మ, రేవంత్, వాసు, ప్రసాద్ శర్మ, సాయి బాబు తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంఘం ఆధ్వర్యంలో..
స్థానిక బీసీ భవన్‌లో పింగళి వెంకయ్య చిత్రపటానికి నివాళుల ర్పించారు. కార్యక్రమంలో బీసీ జనసభ రాష్ట్ర కార్యదర్శి పిన్నిక లక్ష్మీ ప్రసాద్, నాయకులు చాతరాజుపల్లి శ్రీనివాసులు, టి.పి.వెంకటేశ్వర్లు, నాగార్జున, పృధ్వి, రంగస్వామి, రంగారావు, వెంకటేశ్ పాల్గొన్నారు.