నిత్యావసరాల ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2021-10-29T05:38:43+05:30 IST

ఇష్టానుసారంగా పెంచుతున్న నిత్యావసరాలైన పెట్రోల్‌, గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని వా మపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు.

నిత్యావసరాల ధరలు తగ్గించాలి
వై.పాలెంలో నిరసన తెలుపుతున్న వామపక్ష నేతలు

వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు

తహసీల్దార్‌కు వినతిపత్రాల అందజేత

మార్కాపురం(వన్‌టౌన్‌), అక్టోబరు 28:  ఇష్టానుసారంగా పెంచుతున్న నిత్యావసరాలైన పెట్రోల్‌, గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని వా మపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. పెరి గిన ధరలకు నిరసనగా మార్కాపురంలో గురు వారం ప్రదర్శన కోర్టు సెంటర్‌లో రాస్తారోకో ని ర్వహించారు. కార్యక్రమంలో  సీపీఎం నాయ కులు డీకేఎం రఫి, డి.సోమయ్య, ఏనుగుల సురేష్‌, సీపీఐ నాయకులు అందె నాసరయ్య, ఖాసీం, ఎంపీజే నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

తర్లుపాడులో..

తర్లుపాడు : పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని వామపక్షాల ఆ ధ్వర్యంలో తహసీల్ధార్‌ కార్యాలయం వద్ద ఆం దోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు ఏరువ పాపిరెడ్డి మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు పెంచి పేదలపై భారాలు మోపుతోందన్నారు. అనంతరం తహసీల్దార్‌ కా ర్యాలయ సూపరింటెండెంట్‌కు  వినతిపత్రం స మర్పించారు. కార్యక్రమంలో నాగూర్‌వలీ, స ద్దాం, బాలయ్య పాల్గొన్నారు.

వై.పాలెంలో..

ఎర్రగొండపాలెం : పెరిగిన పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలని వామపక్ష నాయకులు ని రసన కార్యక్రమం నిర్వహించారు.  కార్యక్రమం లో సీపీఐ నియోజకవర్గ  కార్యదర్శి శ్రీనివాస్‌, టీసీహెచ్‌ చెన్నయ్య, సీపీఐ నాయకులు కృష్ణ గౌడ్‌, గురవయ్య,, సీపీఎం ఏరియా కార్యదర్శి జి బాలనాగయ్య,నక్కా తిరుపతయ్య, శివయ్య,  మొగిలి వెంకటేశ్వర్లు, వామపక్షాల కార్యకర్తలు పాల్గొని నిరసన తెలిపారు.

దోర్నాలను కరువు మండలంగా

ప్రకటించాలి

పెద్ద దోర్నాల : దోర్నాలను కరువు మండలంగా ప్రకటించాలని వామపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద రైతు సంఘం జిల్లా నాయకుడు గాలి వెంకట రామిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిత్యావసరాల ధరల పెరుగుదల, మండలంలో నెలకొన్న కరువు పరిస్థితులపై నిరసన కార్యక్రమం చేపట్టారు.  అనం తరం గాలిరెడ్డి మాట్లాడుతూ  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు  అవలం బిస్తున్నాయన్నారు. కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. సరైన వర్షపాతం లేక మండలంలో రైతులు అల్లాడిపోతున్నారని, దీనికి తోడు ఎరువుల పురుగు మందుల ధర లు విపరీతంగా పెంచారని అన్నారు. పెల్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలు, నిత్యావసర సరుకులు రోజు రోజుకూ పెరుగుతున్నా వాటిని నియం త్రించడంలో పాలకులు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దారు వుణుగోపాల్‌కు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు తిరుపతిరెడ్డి, దావీదు, నాగూరుయ్య పాల్గొన్నారు.Updated Date - 2021-10-29T05:38:43+05:30 IST