ప్రజలతో కలిసి పయనిద్దాం

ABN , First Publish Date - 2021-07-12T05:41:18+05:30 IST

‘ప్రజలతో కలిసి పయనిద్దాం. వారి మనోభావాలను గౌరవిద్దాం. వారి ఆదరాభిమానాలను సంపాదించుకుంటూ పార్టీ కేడర్‌, శ్రేణులను ఉత్తేజపరుస్తూ ముందుకు సాగుదాం’. అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను పిలిపించుకుని పలు అంశాలపై సమీక్షించారు. తొలుత ప్రభుత్వ పనితీరు, నిర్ణయాలపై ప్రజల మనోభావం ఎలా ఉందని గొట్టిపాటిని అడిగినట్లు తెలిసింది. మీరు నిత్యం ప్రజలతో మమేకమై ఉన్నందున వారి అభిప్రాయాలు, కేడర్‌ మనోభావాలు మీకు తెలుస్తాయని, వాటిని వివరించాలని కోరినట్లు సమాచారం.

ప్రజలతో కలిసి పయనిద్దాం

నిజాలను గ్రహిస్తున్నందుకు సంతోషం

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటితో చంద్రబాబు 

పలు కీలక అంశాలపై సమీక్ష

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

‘ప్రజలతో కలిసి పయనిద్దాం. వారి మనోభావాలను గౌరవిద్దాం. వారి ఆదరాభిమానాలను సంపాదించుకుంటూ పార్టీ కేడర్‌, శ్రేణులను ఉత్తేజపరుస్తూ ముందుకు సాగుదాం’. అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను పిలిపించుకుని పలు అంశాలపై సమీక్షించారు. తొలుత ప్రభుత్వ పనితీరు, నిర్ణయాలపై ప్రజల మనోభావం ఎలా ఉందని గొట్టిపాటిని అడిగినట్లు తెలిసింది. మీరు నిత్యం ప్రజలతో మమేకమై ఉన్నందున వారి అభిప్రాయాలు, కేడర్‌ మనోభావాలు మీకు తెలుస్తాయని, వాటిని వివరించాలని కోరినట్లు సమాచారం. దీంతో గొట్టిపాటి నియోజకవర్గంలో ప్రజలను కలిసినప్పుడు వారి వ్యక్తం చేసే అభిప్రాయాలు, అధికార పార్టీ పనితీరు, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను తెలియజేసినట్లు సమాచారం. పలు ప్రభుత్వ నిర్ణయాలపై  ప్రజల్లో అసంతృప్తి ప్రారంభమైందని, బహిరంగంగానే వారు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారని చెప్పినట్లు తెలిసింది. ఏడాది క్రితానికి, ఇప్పటికి గ్రామాలకు వెళ్లినప్పుడు ప్రజలు తమను కలిసి మాట్లాడుతున్న తీరును రవికుమార్‌ వివరించినట్లు సమాచారం. అధికార పార్టీ నేతలు ఇబ్బంది పెడుతున్న విషయాలను, వివిఽధ సంక్షేమ పథకాల్లో అనుసరిస్తున్న పక్షపాత వైఖరి గురించి రవికుమార్‌ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం టీడీపీకి అండగా నిలుస్తున్న అభిమాన ప్రజలకు సంక్షేమ ఫలాలను అందకుండా చేస్తున్నారని చెప్పినట్లు సమాచారం. ఇటీవల చేయూత పథకం లబ్ధిదారుల జాబితా నుంచి టీడీపీ శ్రేణులను తొలగించిన విషయాన్ని చంద్రబాబు దృష్టికి రవికుమార్‌ తీసుకెళ్లారు. వాటిపై బాబు స్పందిస్తూ ‘ప్రజలతో మమేకమవుతున్న మీ తీరు బాగుంది. మీ వ్యాపారాలను స్తంభింపజేసి మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టినా మనోధైర్యంతో నిలబడిన వైఖరి అభినందనీయం’ అని అన్నట్లు  తెలిసింది.  అలాగే జిల్లాలో పార్టీ వ్యవహారాల తీరుతెన్నులపై కూడా ఆరా తీసినట్లు సమాచారం. తదనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఇకపై నాతోపాటు మీరంతా కూడా ప్రజలతో మమేకమై పయనించాలని, వారి అభిప్రాయాలను గౌరవిస్తూ వారిని ఉత్తేజపరుస్తూ పయనించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నట్లు తెలిసింది. తదనుగుణంగా కార్యాచరణ కూడా రూపొందించామని చెప్పినట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం గొట్టిపాటి, బాపట్ల లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమావేశమై చంద్రబాబు సూచించిన అంశాలపై చర్చించుకున్నారు.  

Updated Date - 2021-07-12T05:41:18+05:30 IST