వైసీపీ పాలనతో విసిగిన ప్రజలు
ABN , First Publish Date - 2021-12-10T04:45:04+05:30 IST
వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ చెప్పారు.

టీడీపీ ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షుడు నూకసాని బాలాజీ
పొదిలి (రూరల్) డిసెంబరు 9 : వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ చెప్పారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలను పలు రూపాల్లో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మామీలను తుంగలో తొక్కి నియంతలా పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత హామీలతోపాటు రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారన్నారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో అనసర విమర్శలు, మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం చూస్తే వారి వైఖరి అర్థమవుతోందన్నారు. మద్య నిషేధమని చెప్పి మద్యం ప్రియుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చెప్పారు. ఓటీఎస్ పేరుతో పేదల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడడంతో వైసీపీ పతనం ప్రారంభమైందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే పేదల గృహాలకు ఉచితంగా రిజిస్ర్టేషన్ చేస్తామని బాలాజీ చెప్పారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు మీగడ ఓబులరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ముల్లా ఖుద్దూస్, రాష్ట్ర కార్యదర్శి గునపూడి భాస్కర్, తెలుగు రైతు కార్యదర్శి ఆవులూరి యలమంద, జిల్లా మైనారిటీ నాయకుడు రసూల్, మాజీ సర్పంచ్ కాటూరి చినబాబు, పాలడుగు నాగేశ్వరరావు, కాటూరి శ్రీను, సురేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.